బట్టలు చిరిగిపోయినా కానీ ఆమె ఎక్కడా తగ్గలేదు..!

ప్రస్తుతం వింటర్ ఒలింపిక్స్ అట్టహాసంగా జరుగుతున్నాయి. అనుభవజ్ఞులైన వాళ్ళు ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. అయితే తొలిసారి పెద్ద వేదిక మీద తమ ట్యాలెంట్ ను ప్రదర్శించేవాళ్ళు మాత్రం కాస్త చిన్న చిన్న తప్పులు చేస్తూ ఉంటారు. అలాగని వారి ట్యాలెంట్ ను తక్కువ చేసి చూడలేము. తాజాగా ఈ వింటర్ ఒలింపిక్స్ లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.

సౌత్ కొరియాకు చెందిన స్కేటర్ యూరా మిన్ తొలిసారి ఒలింపిక్స్ లో పాల్గొంటోంది. అయితే అనుకోనిది ఒకటి జరిగిపోయింది. అదేమిటంటే ఆమె వేసుకున్న డ్రస్సు ఉన్నట్లుండి చినిగిపోయింది. ఆమె తన ప్రదర్శన ఇస్తున్న కొద్ది సెకెన్లలోనే అలా ఆమె బట్టలు చినిగిపోయాయి. అయితే ఆమె ఎక్కడ కూడా తడబాటుకు గురికాలేదు. అందరూ చూస్తున్నా ఆమె తన ప్రదర్శన మీదే దృష్టి పెట్టింది. ఎక్కడైనా చిన్న తప్పు చేస్తే చాలు పాయింట్లు తగ్గిపోయే అవకాశం ఉంది. కానీ ఆమె బట్టలు చినిగిపోయాయని తెలిసి కూడా అప్పుడప్పుడు అలా సర్దుకొని తన ప్రదర్శనను పూర్తీ చేసి శభాష్ అనిపించుకుంది. యూరా మిన్ చూపించిన ధైర్యం అందరి దృష్టినీ ఆకట్టుకుంది. ఆమె క్రీడలకు, క్రీడాకారులకు ఉన్న విలువను మరింత ఇనుమడింపజేసిందని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here