హంపి హోమ్‌స్టేలో విదేశీ మ‌హిళ‌పై లైంగిక‌దాడియ‌త్నం.. మ‌న పోలీసుల మీద న‌మ్మ‌కం లేక‌!

కొప్ప‌ళ: ప‌్రపంచ ప్ర‌ఖ్యాతి గాంచిన ప‌ర్యాటక కేంద్రం హంపిలో విదేశీ మ‌హిళ‌పై లైంగిక దాడికి ప్ర‌య‌త్నించాడో వ్య‌క్తి. మ‌న పోలీసుల మీద న‌మ్మ‌కం ఉందో, లేదో గానీ.. ఏకంగా త‌న స్వ‌దేశానికి వెళ్లి, అక్క‌డి భార‌త రాయ‌బార కార్యాల‌యంలో ఫిర్యాదు చేసిందామె.

దీనిపై శ‌ర‌వేగంగా స్పందించిన భార‌త రాయ‌బార కార్యాల‌యం జిల్లా పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. దీనితో వారు అత‌ణ్ని అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని కొప్ప‌ళ జిల్లా హంపిలో చోటు చేసుకుంది. నిందితుడి పేరు ఆనంద్ రెడ్డి.

హంపి స‌మీపంలోని హ‌నుమ‌న హ‌ళ్లి గ్రామానికి చెందిన ఆనంద్ రెడ్డికి హంపి హోమ్ స్టేలో భాగ‌స్వామ్యం ఉంది. హంపిన సంద‌ర్శించ‌డానికి దేశ‌, విదేశాల‌కు చెందిన ప‌ర్యాట‌కులు ఈ హోమ్ స్టే నివాసాల్లో ఉండ‌టానికి ఇష్ట‌ప‌డ‌తారు.

ఇందులో భాగంగా.. కొద్దిరోజుల కింద‌ట అమెరికా మ‌హిళ ఒక‌రు హంపి ప‌ర్యట‌న‌కు వ‌చ్చారు. ఆమెతో వ‌చ్చిన వారు బెంగ‌ళూరులోనే ఉండిపోగా.. ఆమె ఒంట‌రిగా హంపికి వ‌చ్చారు. హ‌నుమ‌న హ‌ళ్లిలోని హోమ్ స్టేలో దిగారు.

ఆమె ఒంట‌రిగా ఉన్న విష‌యాన్ని తెలుసుకున్న ఆనంద్ రెడ్డి హోమ్ స్టేకు చేరుకున్నారు. స్పా, మ‌సాజ్ పేరుతో ఆమెను మ‌భ్య‌పెట్టాడు. లైంగిక దాడికి ప్ర‌య‌త్నించాడు. ఆమె ప్ర‌తిఘ‌టించ‌డంతో అక్క‌డి నుంచి పారిపోయాడు.

ఈ విష‌యాన్ని ఆమె స్థానిక పోలీసుల‌కు వెల్ల‌డించలేదు. నేరుగా అమెరికాకు వెళ్లిన త‌రువాత అక్క‌డి భార‌త రాయ‌బార కార్యాల‌యంలో ఫిర్యాదు చేశారు. హోమ్ స్టే ర‌శీదు, ఫొటోలు ఇత‌ర‌త్రా వివ‌రాల‌న్నింటినీ ఆమె అక్క‌డి అధికారుల‌కు అంద‌జేశారు. దీనికి స్పందించిన అమెరికాలోని భారత రాయ‌బార కార్యాల‌యం కొప్ప‌ళ జిల్లా పోలీసుల‌కు ఇమెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీనితో రంగంలోకి దిగిన జిల్లా పోలీసులు ఆనంద్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అత‌ను త‌న నేరాన్ని అంగీక‌రించాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here