ఓ చేత్తో స్టీరింగ్‌..మ‌రో చేత్తో సెల్‌ఫోన్‌! `భ‌ర‌త్‌..` టైప్‌లో ఫైన్ వేయాల్సిందే!

సెల్‌ఫోన్ మాట్లాడితూ వాహ‌నాల‌ను న‌డిపితే భారీగా జ‌రిమానాలు విధిస్తామంటూ ప్ర‌భుత్వాలు హెచ్చ‌రించిన‌ప్ప‌టికీ.. డ్రైవ‌ర్ల‌లో ఏ మాత్రం మార్పు రాలేద‌న‌డానికి నిద‌ర్శ‌నం ఈ ఫొటోలు. కొద్దిరోజుల కింద‌టే చోటు చేసుకున్న భారీ ప్ర‌మాదానికి సంబంధించిన ర‌క్త‌పు చారిక‌లు, వారి కుటుంబ స‌భ్యుల క‌న్నీటి చారిక‌లు ఇంకా ఆరిపోయి కూడా ఉండ‌వు. అప్పుడే అదే తెలంగాణ‌లో ఓ బ‌స్ డ్రైవ‌ర్ నిర్ల‌క్ష్యంగా బ‌స్సును న‌డుపుతూ సెల్ ఫోన్ కెమెరా కంటికి చిక్కారు.

తెలంగాణ ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్ ఆయ‌న‌. ఓ చేత్తో స్టీరింగ్ ప‌ట్టుకుని, ఇంకో చేత్తో స్మార్ట్‌ఫోన్‌లో వాట్స‌ప్ మెసేజీల‌నో, ఫేస్‌బుక్‌నో చూస్తూ కొన్ని కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు బ‌స్సును న‌డిపిస్తూ వెళ్లిపోయాడా డ్రైవ‌ర్‌. దీనికి సంబంధించిన పూర్తి వివ‌రాలేవీ అందుబాటులో రావ‌ట్లేదు.  `భ‌ర‌త్ అనే నేను..`లో వేసిన‌ట్లు వేల‌కు వేల రూపాయ‌ల జ‌రిమానాలు విధిస్తే గానీ ఇలాంటి డ్రైవ‌ర్లు దారిలోకి రారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here