మ‌రో ఏవియేష‌న్ మిస్ట‌రీ: టేకాఫ్ తీసుకున్న‌10 నిమిషాల్లోనే హెలికాప్ట‌ర్ మాయం!

ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌-ఓఎన్‌జీసీ ఉద్యోగులు ప్రయాణిస్తున్న హెలికాప్ట‌ర్ అదృశ్య‌మైంది. వారు ప్ర‌యాణిస్తోన్న పవన్‌ హాన్స్‌ హెలికాప్టర్‌ శనివారం ఉదయం ముంబయిలోని జుహు విమానాశ్రయం నుంచి ఉదయం 10:20 నిమిషాల‌కు టేకాఫ్‌ అయింది.

ప‌ది నిమిషాల త‌రువాత అంటే స‌రిగ్గా 10:30 గంట‌ల‌కు జుహూ విమానాశ్ర‌యంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. న‌లుగురు ఓఎన్‌జీసీ ఉన్న‌తాధికారులు, ఇద్ద‌రు పైలెట్లు ఉన్నారు.

ఈ విష‌యం తెలిసిన వెంట‌నే ఓఎన్‌జీసీ అధికారులు ఇండియన్‌ కోస్ట్‌ గార్డు సిబ్బందికి సమాచారం అందించారు. ముంబయికి 30 నాటికల్‌ మైళ్ల దూరంలో ఉన్న సమయంలో చాపర్‌ అదృశ్యమైనట్లు అధికారులు చెబుతున్నారు.

టేకాఫ్‌ అయిన కొద్ది సేపటికే ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌ సిబ్బందికి హెలికాప్టర్‌ పైలట్లకు మధ్య ఉన్న సంబంధాలు తెగిపోయాయి. అదృశ్యమైన ఈ హెలికాప్టర్‌ కోసం అధికారులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

ఏడేళ్ల కింద‌ట కొనుగోలు చేసిన వీటీపీడబ్ల్యూఏ డౌఫిన్ ఎఎస్ 365 ఎన్‌3 ర‌కం హెలికాప్ట‌ర్ ఇది. 10:58 నిమిషాల‌కు అది నిర్దేశిత ప్ర‌దేశంలో ల్యాండ్ కావాల్సి ఉంది. ఈ ఘ‌ట‌న‌పై ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ స్పందించారు. ద‌ర్యాప్తు వేగ‌వంతం చేయాల‌ని కోస్ట్‌గార్డ్‌ను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here