ముద్దుల్లో మునిగిన లెస్బియ‌న్ల‌ను కారు నుంచి గెంటేసిన ఉబేర్ డ్రైవ‌ర్‌! ఇప్పుడ‌త‌ని ప‌రిస్థితి..!

త‌న కారులో ప్ర‌యాణిస్తూ, ముద్దుల్లో మునిగి పోయిన ఓ లెస్బియ‌న్ జంట‌ను బ‌య‌టికి గెంటేశాడు ఉబేర్ డ్రైవ‌ర్‌. త‌మ‌పై దౌర్జ‌న్యం చేశాడంటూ ఆ లెస్బియ‌న్లిద్ద‌రూ ఉబేర్ సంస్థ‌కు ఫిర్యాదు చేశారు. ఈ విష‌యాన్ని యాజ‌మాన్యం దృష్టికి తీసుకెళ్లారు. దీనితో ఉబేర్ సంస్థ యాజ‌మాన్యం.. అత‌ణ్ని నిషేధించింది. ఆ డ్రైవ‌ర్ పేరును బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది.

అమెరికాలోని బ్రూక్లిన్‌లో చోటు చేసుకుంది. ఆ డ్రైవ‌ర్ పేరు అహ్మ‌ద్ అల్ బౌటారి. ఉబేర్ కారు డ్రైవ‌ర్‌. బ్రూక్లిన్ నుంచి మ‌న్‌హ‌ట్ట‌న్‌కు వెళ్ల‌డానికి ఎమ్మా పిఛ్ల్‌, అలెక్స్ లోవిన్ అనే లెస్బియ‌న్లు ఆన్‌లైన్ ద్వారా ఉబేర్ కారును బుక్ చేసుకున్నారు. వారిని మ‌న్‌హ‌ట్ట‌న్‌లో దించ‌డానికి అహ్మ‌ద్ కారును తీసుకొచ్చాడు.

కొంత‌దూరం ప్ర‌యాణించాక‌.. ఆ లెస్బియ‌న్లిద్ద‌రూ ముద్దులు పెట్టుకోవ‌డం ప్రారంభించారు. దీన్ని గ‌మ‌నించిన అహ్మ‌ద్ వారిని నివారించాడు. ఆ స‌మ‌యంలో అత‌ను రంజాన్ ఉప‌వాసంలో ఉన్నాడు. త‌న కారులో ఇలాంటివి చేయొద్ద‌ని సూచించాడు. అయిన‌ప్ప‌టికీ.. వారిద్ద‌రూ ప‌ట్టించుకోలేదు. మ‌రింత ఘాటు శృంగారానికి దిగారు.

దీనితో అహ్మ‌ద్ కారును ఆపేసి, ఇద్ద‌ర్నీ దిగిపొమ్మ‌ని హెచ్చ‌రించాడు. వారు అంగీక‌రించ‌క‌పోవ‌డంతో- పెద్ద స్వ‌రంతో కారు నుంచి వారిని బ‌య‌టికి గెంటేశాడు. ఈ ఘ‌ట‌న‌తో బిత్త‌ర‌పోయిన వారిద్ద‌రూ ఉబేర్ సంస్థ యాజ‌మాన్యానికి ఫిర్యాదు చేశారు. దీనితో అత‌నిపై చ‌ర్య‌లు తీసుకుందా యాజ‌మాన్యం. అహ్మ‌ద్ పేరును బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here