33,000 రూపాయలు పెట్టి ఆన్ లైన్ లో ఫోన్ కొంటే..!

33,000 రూపాయలు పెట్టి ఆన్ లైన్ లో ఫోన్ కొన్నాడు.. డెలివరీ బాయ్ వచ్చి ఫోన్ బాక్స్ ను ఇచ్చాడు. ఎంతో ఆనందంతో బాక్స్ సీల్ ఓపెన్ చేస్తే.. ఆ ఆనందం కాస్తా ఆవిరి అయిపోయింది. అందులో ఉంది ఫోన్ కాదు.. ఓ రాయి. దీంతో ఆ యువకుడు కంపెనీకి ఫిర్యాదు చేశాడు.

మహారాష్ట్ర లోని కళ్యాణ్ కు చెందిన రాకేశ్ చబారియాకు ఈ ఘటన ఎదురైంది. అమెజాన్ ఇండియా వెబ్ సైట్ లో ఓ ఫోన్ కొన్నాడు. దాని రాకకోసం ఎంతగానో ఎదురు చూశాడు. దాన్ని తెరచి చూస్తే ఓ పెద్ద రాయి ఉంది. రాకేశ్ దగ్గరకి డెలివరీ బాయ్ బాక్స్ తీసుకొని వచ్చాడు. పార్సిల్ తీసుకోగానే అతడికి అనుమానం వచ్చింది. ఏదో కదులుతున్నట్లు అనిపించింది. దీంతో డెలివరీ బాయ్ తోనే పార్సిల్ ను ఓపెన్ చేయించాడు. అందులో ఫోన్ ఉండాల్సిన చోట రాయి ఉంది. దాని ఫోటోలు తీసిన రాకేశ్ దాని గురించి అమెజాన్ కు మెయిల్ పెట్టాడు.

దీనికి అమెజాన్ స్పందించింది. ఈ ఘటనకు బాధితులను ఖచ్చితంగా కనిపెడతామని.. మూడు, నాలుగు రోజుల్లోగా ఫోన్ లేదా ఆ డబ్బులు తిరిగి ఇస్తామని చెప్పారు. అయితే వారం రోజులు అయినా స్పందించకపోవడంతో మీడియా కు ఎక్కాడు రాకేశ్..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here