చనిపోయిన మహిళని ముట్టుకోకూడదని ఆజ్ఞలు జారీ చేశారు.. ప్రియుడే భుజాల మీద..!

ఓ మహిళని ముట్టుకోకూడదని ఆజ్ఞ జారీ చేయడంతో దాదాపు 12 గంటల పాటూ అంతిమసంస్కారాలు నిర్వహించలేదు. దీంతో చివరికి ఆమె ప్రియుడే వచ్చి భుజాల మీద తీసుకొని వెళ్ళాడు. ఈ ఘటన రాజస్థాన్ రాష్ట్రం లోని సువానా గ్రామంలో చోటుచేసుకుంది.

సువానా గ్రామానికి చెందిన సోహనీ దేవి భర్త చనిపోయాడు. ఆమె గ్రామంలోని ఓ హరిజన యువకుడు నారాయణ లాల్ తో సన్నిహితంగా ఉండేది. ఇద్దరు పిల్లలకు తల్లి అయిన సోహనీ దేవి చేసిన పనికి గ్రామస్థులు పంచాయతీ పెట్టారు. ఆమెను, ఆమె ప్రియుడిని ఊరి వాళ్ళు తాక కూడదని.. వారికి ఎటువంటి సహాయం చేయకూడదని గ్రామ పెద్దలు ఆజ్ఞలు జారీ చేశారు. తాము చెప్పింది పాటించని గ్రామస్థులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని చెప్పారు.

కొద్ది రోజులకు సోహనీ దేవి అనారోగ్యం పాలైంది. దీంతో ఆమెను ఓ ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాడు ఆమె ప్రియుడు నారాయణ లాల్. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది. దీంతో తిరిగి గ్రామానికి చేరుకున్న నారాయణ లాల్ ఆమె అంత్యక్రియలు నిర్వహించాలని అనుకున్నాడు. అయితే ఆ ఊరి వారెవరూ కనికరించలేదు. అంతే కాకుండా తమ ఊరిలో ఆమెను ఖననం చేయకూడదని చెప్పారు. ఇక ఏమీ చేయలేని నారాయణ లాల్ ఆమె శవాన్ని భుజాన వేసుకొని అంబులెన్స్ లో చేర్చి పక్కనే ఉన్న గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించాడు. కనీసం ఆమె పిల్లలను కూడా అంత్యక్రియలకు హాజరు కానివ్వలేదు గ్రామస్థులు. పోలీసులు మొత్తం తెలిసి కూడా సైలెంట్ గా ఉన్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here