వందకు పైగా కోతులు..ఒకేసారి! విష‌ప్ర‌యోగ‌మా? చ‌ట్నీ తిన‌డ‌మా?

ల‌క్నో: ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో దారుణ ఘ‌ట‌న చోటు చేసుకుంది. ఒకే గ్రామంలో వంద‌కు పైగా కోతులు అనూహ్య ప‌రిస్థితుల్లో మ‌ర‌ణించాయి. కోతుల‌పై విష‌ప్ర‌యోగం జ‌రిగి ఉండొచ్చ‌ని పోలీసులు, అట‌వీశాఖ సిబ్బంది అనుమానిస్తున్నారు. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌ అమ్రోహ జిల్లాలోని ఢావ్‌రాసి గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ప్రాథమిక విచారణలో అవి విషం కారణంగానే చనిపోయినట్లు తేలింది. గ్రామ‌స్తుల వాద‌న భిన్నంగా ఉంది. చౌమీన్ చట్నీ తిన‌డం వ‌ల్లే అవి మ‌ర‌ణించాయ‌ని అంటున్నారు.

నూడుల్స్‌లో అద్దుకుని తిన‌డానికి ఉత్త‌రాది వారు చౌమీన్ చ‌ట్నీని ఎక్కువ‌గా వాడుతుంటారు. ఈ చ‌ట్నీ తిని కోతులు మ‌ర‌ణించాయ‌ని చెబుతున్నారు. ఈ ఘటనపై అటవీ శాఖ రంగంలోకి దిగింది. కోతుల క‌ళేబ‌రాల‌ను పోస్ట్‌మార్ట‌మ్ కోసం పంపించారు. ఆ నివేదిక వ‌చ్చిన త‌రువాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here