3000కు పైగా యాప్స్.. మీ డేటా కొట్టేస్తున్నాయి..!

ప్రస్తుతం ఫేస్ బుక్ తమ యూజర్ల డేటా లీక్ చేసిందని అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఫేస్ బుక్ యూజర్లకు సంబంధించిన డేటా మొత్తం లీక్ అయిపోయిందని గగ్గోలు పెడుతున్నాయి కొన్ని సంస్థలు. అయితే ఏకంగా 3000కు పైగా యాప్స్ తమ యూజర్ల డేటాను పర్మిషన్ అనేదే లేకుండా కొట్టేస్తోందట. గూగుల్ ప్లే స్టోర్ లో ఉన్న 3,300 ఆండ్రాయిడ్ యాప్స్ డేటా చౌర్యం చేస్తున్నట్లు తేలింది.

ఇక చిన్న పిల్లల కోసం తయారు చేసిన యాప్స్ కూడా అలాంటి పనులే చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నేషనల్ కంప్యూటర్ సైన్స్ ఇన్స్టిట్యూట్ రీసర్చ్(ICSI) సంస్థ చేసిన సర్వేలో ఈ విషయం తేలింది. ప్రైవసీ పాలసీలను తుంగలోకి తొక్కి 5,855 యాప్స్ చాలా డేటాను కొట్టేస్తున్నాయి. 13 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లల సమాచారాన్ని కూడా లాగేసుకుంటూ ఉన్నాయి.

ఇందులో కొన్ని యాప్స్ అయితే తల్లిదండ్రుల అనుమతి లేకుండానే పిల్లల లొకేషన్ ను తెలుసుకుంటూ ఉన్నాయి. ఇక పేర్లు, ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నంబర్లను తమ సొంతం చేసుకుంటున్నాయని ఈ రిపోర్ట్ లో తేలింది. ఫ్రీగా ఉన్న యాప్స్ లో చాలా వరకూ ఇలాంటిదే జరుగుతోందని తెలుస్తోంది. అయితే దీనిపై చర్యలు తీసుకోవాలని ఆ సర్వే చేసిన వాళ్ళు చెబుతున్నారు. ఉచితంగా దొరుకుతున్నాయని ఏది పడితే ఆ యాప్ డౌన్లోడ్ చేస్తే చాలా కష్టం అని సలహా ఇస్తున్నారు. ఈ డేటా చౌర్యం వలన చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయని చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here