సెక్సీ గోల్ఫర్ గా ఆమెకు పేరు.. దుబాయ్ లో కూడా పొట్టి బట్టలు వేసుకొని ఆడింది.. తర్వాత ఏమైందంటే..!

పేజ్ స్పిరానాక్ గోల్ఫర్ గా బాగా ప్రసిద్ధి. అలాగని ఆమేమీ ప్రపంచ ఛాంపియన్ కాదు..! ఆమె గోల్ఫ్ ఆడేటప్పుడు వేసే బట్టలు.. ఆమె అందమే పేరు తెచ్చిపెట్టింది. ఏ టోర్నీ జరిగినా చాలా తక్కువ బట్టలు వేసుకొని గోల్ఫ్ ఆడేది. అయితే అన్ని దేశాలూ ఒకేలా ఉండవు కదా.. అలా ఓ సారి దుబాయ్ లో జరిగిన టోర్నమెంట్ ఆడటానికి ఆమెకు ఆహ్వానం వచ్చింది. అప్పుడు కూడా ఆమె పొట్టిబట్టలు వేసుకొనే ఆడింది. అంతే ఆ తర్వాత ఏకంగా చంపేస్తామంటూ ఆమెకు బెదిరింపులు ఎదురయ్యాయి.

పేజ్ స్పిరానాక్ 2015 లో దుబాయ్ లో టోర్నమెంట్ కు వెళ్ళింది. 24ఏళ్ల పేజ్ టాప్ 1000 ర్యాంకు లోపల కూడా లేదు. అయినప్పటికీ ఆహ్వానం రావడంతో వెళ్ళిన ఆమె అక్కడకు వెళ్ళి గోల్ఫ్ ఆడింది. కానీ పొట్టిబట్టలు వేసుకొని ఆడడంతో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ఆ తర్వాత పలువురు ఆమెను బెదిరించారు. తమ దేశంలోకి వచ్చిన మహిళలు ఇలాంటి బట్టలు అసలు వేసుకోకూడదు అని ఆమెతో అన్నారు. చంపేస్తామని బెదిరించడంతో తానూ.. తన కుటుంబ సభ్యులు తెగ భయపడిపోయామని ఆమె ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది.

https://www.instagram.com/p/BdquxLAHnWj/?hl=en&taken-by=_paige.renee

చాలా మంది తన బట్టలను చూసి తన గురించి తప్పుగా మాట్లాడుతారని.. ఎవరైనా కానీ ఒకరి బట్టలు చూసి అంచనాకు రాకూడదని చెప్పింది. నాకు గోల్ఫ్ అంటే ప్రాణం.. అందుకు అనుగుణమైన బట్టలు వేసుకుంటాను తప్పిస్తే ఎవరికోసం కాదని ఆమె చెప్పింది. ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో పేజ్ కు 1.3మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here