ధోని లాగా స్టంట్ చేయాలని ప్రయత్నించిన పాకిస్థాన్ కెప్టెన్.. నవ్వుల పాలయ్యాడు..!

సర్ఫరాజ్ అహ్మద్ భారత మాజీ కెప్టెన్ ధోనీ లాగా స్టంట్ చేయాలని భావించి నవ్వులపాలయ్యాడు. న్యూజిలాండ్ తో జరిగిన టీ20 మ్యాచ్ లో సర్ఫరాజ్ స్టంప్ అవుట్ అయ్యాడు. ఆ సమయంలో క్రీజ్ లోకి చేరుకోవాలని భావించి ధోని లా ఫీట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ అది వీలుపడలేదు సరి కదా నవ్వులపాలయ్యాడు.

ఇప్పటికే 5-0 తేడాతో వన్డే సిరీ ఓడిపోయిన పాకిస్థాన్ టీ20 సిరీస్ ను కూడా ఓటమితోనే మొదలుపెట్టింది. ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ 10వ ఓవర్ లో మొదటి బాల్ కి అవుట్ అయ్యాడు. మిచెల్ శాంట్నర్ వేసిన బంతిని స్వీప్ చేయాలని ప్రయత్నించాడు సర్ఫరాజ్.. అయితే ఎక్స్ ట్రా బౌన్స్ కారణంగా ఆడలేకపోయాడు. దీంతో క్రీజ్ లో చేరుకోవాలని ప్రయత్నించిన సర్ఫరాజ్ కు కీపర్ అంత ఛాన్స్ ఇవ్వలేదు. సర్ఫరాజ్ క్రీజులో కాలుపెట్టే లోపలే కీపర్ స్టంప్ అవుట్ చేశాడు. ఈ మ్యాచ్ లో సర్ఫరాజ్ 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. దీంతో సర్ఫరాజ్ చేసిన స్టంట్ ను ధోనీ స్టంట్ తో పోల్చడం మొదలుపెట్టారు. నువ్వేమన్నా ధోని అనుకుంటున్నావా సర్ఫరాజ్ అని పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here