పాకిస్థాన్ ఫ్యాన్స్ కి విరాట్-అనుష్క లు రావాలట.. భారత్ ఫ్యాన్స్ ఏమని సమాధానం ఇచ్చారంటే..!

ఇటీవలే పాకిస్థాన్ సూపర్ లీగ్ పూర్తయిపోయింది. పాకిస్థాన్ సూపర్ లీగ్ మూడవ అంచె ఫైనల్ ఇస్లామాబాద్ లో జరిగింది. ఇస్లామాబాద్ యునైటెడ్, పెషావర్ జల్మి జట్ల మధ్య ఫైనల్ పూర్తీ అయింది. ఇందులో ఇస్లామాబాద్ యునైటెడ్ గెలుపొందింది. దాదాపు తొమ్మిదేళ్ళ తర్వాత ఇస్లామాబాద్ లో క్రికెట్ మ్యాచ్ ఆడారు. మొత్తం 8000 మంది బలగాలతో మ్యాచ్ కు సెక్యూరిటీ ఇచ్చారు.

అయితే ఈ సీజన్ మొత్తం భారత క్రికెటర్ విరాట్ కోహ్లీని అభిమానులు ఎక్కువగా తలచుకున్నారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో విరాట్ కోహ్లీ ఆడాలని కోరారు. క్రికెట్ లెజెండ్ షాహిద్ అఫ్రీది కూడా భారత ఆటగాళ్ళు, విరాట్ లాంటి వాళ్ళు పిఎస్ఎల్ ఆడాలని కోరారు. బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత క్రికెటర్లు ఎవరూ వేరే దేశ లీగ్ మ్యాచ్ లు ఆడకూడదని తమకు తెలుసునని అన్నారు. కనీసం వచ్చే సీజన్ కు అన్నా వారిని ఆహ్వానించాలని అఫ్రీది అన్నారు. ఇటీవల జరిగిన పీఎస్ఎల్ ఫైనల్ లో కూడా పాకిస్థాన్ అభిమానులు విరాట్ కోహ్లీని చూడాలని కోరారు. అందుకు సంబంధించిన ప్లకార్డులు పట్టుకొని స్టేడియంలో సందడి చేశారు. అనుష్క శర్మ ను కూడా చూడాలని అనుకున్నామని చెప్పారు. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత అభిమానులు కోహ్లీని కొనే అంత డబ్బులు పాకిస్థాన్ బోర్డు దగ్గర లేవని తేల్చి చెప్పారు. కోహ్లీ ధర పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రైజ్ మనీ కంటే చాలా ఎక్కువని పాక్ అభిమానులను ట్రోల్ చేశారు..

అలాంటివే మరికొన్ని..

https://twitter.com/IamMksahu/status/978009274038173696

https://twitter.com/IamMksahu/status/978184955707539457

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here