పాక్ మాజీ క్రికెట‌ర్ ఇమ్రాన్ ఖాన్ ముచ్చ‌ట‌గా మూడోసారి.. పెళ్లి!

న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్‌, తెహ్రిక్-ఎ-ఇన్సాఫ్ పార్టీ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ ముచ్చ‌ట‌గా మూడోసారి పెళ్లి చేసుకున్నారు. 65 సంవ‌త్స‌రాల వ‌య‌స్సులో ఆయ‌న బుష్రా మ‌నేకను వివాహం చేసుకున్నారు. బుష్రా మ‌నేక ఓ జ్యోతిష్యురాలు.

ఇమ్రాన్ ఖాన్‌తో ఆమెకు నాలుగేళ్లుగా ప‌రిచ‌యం ఉంది. రాజ‌కీయ నాయ‌కుడిగా బుష్రా జ్యోతిష్యాన్ని ఇమ్రాన్ ఖాన్ బ‌లంగా విశ్వ‌సిస్తారు. భార‌త్‌-పాక్ స‌రిహ‌ద్దుల్లోని పాక్‌ప‌ట్ట‌న్‌కు చెందిన బుష్రా మ‌నేకా వ‌య‌స్సు 40 సంవ‌త్స‌రాలు.

బుష్రాను సంప్ర‌దించిన త‌రువాతే ఇమ్రాన్ ఖాన్ తుది నిర్ణ‌యాల‌ను తీసుకోబోయేవార‌ని పార్టీ నాయ‌కులు చెబుతున్నారు. ఇదివ‌ర‌కే ఇమ్రాన్‌ఖాన్‌కు రెండు పెళ్లిళ్లు జ‌రిగాయి. 1995లో జెమిమా గోల్డ్‌ను పెళ్లాడారు. తొమ్మిదేళ్ల పాటు వారి దాంప‌త్య జీవ‌నం కొన‌సాగింది. 2004లో వారిద్ద‌రూ విడిపోయారు. ఆమె నుంచి విడాకులు తీసుకున్నారు.

ఆ త‌రువాత టీవీ యాంక‌ర్ రేహ‌మ్‌ఖాన్‌ను పెళ్లి చేసుకున్నారు. వారిద్ద‌రి దాంప‌త్యం ఎక్కువ‌రోజులు నిలువ‌లేదు. ప‌ది నెల‌ల్లోనే విడిపోయారు. ముచ్చ‌ట‌గా మూడోసారి బుఝ్రా మ‌నేకాను వివాహం చేసుకున్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here