పాకిస్థాన్ లో పరిస్థితి ఇది.. ఇప్పటికే 65 మంది మృతి..!

ప్రస్తుతం పాకిస్థాన్ ప్రజలు వేడికి అల్లాడిపోతున్నారు. గత కొద్ది రోజులుగా వీస్తున్న వడగాలులకు చాలా మంది ప్రాణాలు ఇప్పటికే పోయాయి. ఇక కరాచీలో అయితే పరిస్థితి మరీ ఘోరంగా ఉందని అంటున్నారు. మంగళవారం లోపు 65 మంది చనిపోయారట. వాతావరణం ఉన్నట్లుండి వేడెక్కిపోయిందని చెబుతున్నారు. అది కూడా రంజాన్ మాసం కావడంతో మరణాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. 45 డిగ్రీలకు పైననే అక్కడి ఉష్ణోగ్రత ఉందట.

ఈదీ ఫౌండేషన్ నడుపుతున్న ఫైసల్ ఈదీ ఈ విషయంపై స్పందించారు. ఆయన తన ఫౌండేషన్ ద్వారా గత కొద్దిరోజులుగా వేడికి తాళలేక కుప్పకూలిపోతున్న చాలా మందిని ఆసుపత్రికి తరలిస్తూ వస్తున్నారు. గత మూడు రోజులుగా 65 మంది చనిపోయారని.. వాళ్ళ శవాలు ఇంకా కోల్డ్ స్టోరేజీలోనే ఉన్నాయని చెప్పారు. వారంతా హీట్ స్ట్రోక్ ద్వారానే చనిపోయారని వైద్యులు ధృవీకరించారు. కరాచీ లోని చాలా ఆసుపత్రులు వడదెబ్బ తగిలిన వారిని చికిత్స అందిస్తూ ఉన్నారు. 2015 లో వడ గాలులకు 1300 మంది చనిపోయారట.. ఈ ఏడాది అలా జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని పలు ఫౌండేషన్ లు పిలుపునిచ్చాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here