అమెరికాపై పవిత్ర యుద్ధం ప్రకటించిన హఫీద్ సయీద్..!

అంతర్జాతీయ ఉగ్రవాది, 26/11 ముంబై పేలుళ్ల సూత్ర‌ధారి హఫీజ్ సయీద్ ను ఇన్నాళ్ళూ పాక్ ప్రభుత్వం వెనకేసుకొని వచ్చింది. పాకిస్థాన్ కేంద్రంగా లష్కర్-ఏ-తైబా, జమాత్-ఉద్-దవా సంస్థల ద్వారా పెద్ద మొత్తంలో నిధులను సమకూర్చి తీవ్రవాదులకు ఆర్థికంగా సహాయం చేస్తున్నాడు. పాక్ అండతోనే అతడు ఇలాంటివి చేస్తున్నాడని భారత్ పలుమార్లు మొత్తుకున్నా పట్టించుకోలేదు. అయితే ఈ విషయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీరియస్ అవ్వడం.. పాక్ కు రావాల్సిన నిధులను రాకుండా చేసింది. దీనిపై హఫీజ్ సయీద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాక్ అణుబాంబులను ఉపయోగించాల్సిన సమయం వచ్చిందని అతడు ఓ ర్యాలీలో చెప్పాడు.

ట్రంప్ వ్యాఖ్య‌ల‌పై స్పందించిన హఫీజ్ స‌యిద్.. అమెరికాపై జిహాద్ (పవిత్ర యుద్ధం) ప్రకటిస్తున్నట్లు వ్యాఖ్యానించాడు. పాకిస్థాన్ ఇక‌ అణుబాంబును వినియోగించాల్సిన సమయం ఆసన్నమైందని అన్నాడు. అమెరికాతో పాటు తాను ఇజ్రాయిల్‌పై కూడా జిహాద్‌ ప్రకటిస్తున్న‌ట్లు తెలుపుతూ లాహోర్‌లో ఆయ‌న‌ ర్యాలీ చేపట్టాడు. ఈ సంద‌ర్భంగానే ఈ వ్యాఖ్య‌లు చేశాడు. పాక్ అధికారులు కూడా ఈ విషయంపై సీరియస్ అయ్యారు. హఫీజ్ సయీద్ ఆస్థులను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. అతడు స్థాపించిన సంస్థలకు ఎవరూ ఫండ్స్ ఇవ్వకూడదని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here