రైల్లో కుక్క పిల్ల టికెట్ తీసుకోలేద‌ట‌..భారీగా ఫైన్ వేసిన స్క్వాడ్‌: దాని య‌జ‌మాని ఎవ‌రో తెలిస్తే షాక్‌

ఓ బుజ్జి కుక్క‌పిల్ల‌. 45 రోజుల వ‌య‌స్సున్న పాకిస్తానీ బుల్లీ బ్రీడ్ ర‌కానికి చెందిన ఆ కుక్క‌పిల్లకు రైల్వే టికెట్ క‌లెక్ట‌ర్ భారీగా ఫైన్ వేశారు. ఎందుకంటే.. అది టికెట్ తీసుకోకుండా రైల్లో ప్ర‌యాణిస్తోంద‌ట. అదీ కార‌ణం.

575 రూపాయ‌ల ఫైన్ వేసిన టీసీ.. ఆ మొత్తాన్ని దాని య‌జ‌మాని నుంచి వ‌సూలు చేశాడు. దీనికి ర‌శీదు కూడా ఇచ్చాడు. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ఆగ్రా కంటోన్మెంట్ రైల్వేస్టేష‌న్‌లో చోటు చేసుకుంది.

ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు వ‌స్తోన్న ద‌క్షిణ్ ఎక్స్‌ప్రెస్‌లో ఈ కుక్క‌పిల్ల ప్ర‌యాణించింది. ఆ కుక్క‌పిల్ల య‌జ‌మాని మ‌న హైద‌రాబాదీయుడే. హైద‌రాబాద్‌లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం నిర్వ‌హిస్తున్నారు. పేరు ర‌మేష్ (పేరు మార్చాం).

33 వేల రూపాయ‌ల‌కు హ‌ర్యానాలో ఆయ‌న ఈ కుక్క‌పిల్ల‌ను కొన్నారు. ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు వ‌స్తుండ‌గా.. సోమ‌వారం తెల్ల‌వారు జామున 2:35 నిమిషాల‌కు రైలు ఆగ్రా కంటోన్మెంట్‌కు చేరుకుంది.

ఆ స‌మ‌యంలో స్పెష‌ల్ స్క్వాడ్ సిబ్బంది టికెట్ల‌ను త‌నిఖీ చేశారు. ర‌మేష్ వ‌ద్ద టికెట్ ఉన్న‌ప్ప‌టికీ.. కుక్కపిల్ల కోసం తీసుకోలేదు. దీనితో స్క్వాడ్ కుక్క‌పిల్ల‌కు 575 రూపాయ‌ల జ‌రిమానా వేసింది. ఈ మొత్తాన్ని ఆయ‌న చెల్లించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here