వాఘా సరిహద్దు వద్దకు వచ్చి తొడకొట్టిన పాక్ క్రికెటర్..!

పాకిస్థానీ క్రికెటర్ హసల్ అలీ చేసిన పని గురించి నెటిజన్లు తీవ్రంగా చర్చిస్తూ ఉన్నారు. అందుకు కారణం అతడు వాఘా సరిహద్దు వద్దకు వచ్చి.. కొన్ని అభివాదాలు చేయడమే..!

https://twitter.com/SAF_Najum/status/987702840704552961

పాకిస్థాన్ మీడియం పేసర్ హసన్ అలీ వాఘా బార్డర్ దగ్గరకు శనివారం నాడు వచ్చాడు. అతడితో పాటూ పాకిస్థాన్ క్రికెట్ టీమ్ సభ్యులు కూడా వచ్చారు. వారు వచ్చినప్పుడు సైనికుల విన్యాసాలు చేస్తున్నారు. ఇంతలో అక్కడే ఉన్న హసన్ అలీ కూడా సైనికులతో పాటూ ముందుకు వచ్చి తొడకొట్టి వెళ్ళాడు. హసన్ అలీ సాధారణంగా మ్యాచ్ లో వికెట్ తీసినప్పుడు ఎలాంటి విన్యాసం చేస్తాడో.. అదే చేసి చూపించాడు. హసన్ అలీ అభివాదం చేసినప్పుడు పాకిస్థాన్ పక్కన ఉన్న ప్రజలు పెద్దగా కేకలు పెట్టారు. ఈ 40 సెకెండ్ల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here