పాకిస్థానీ పెళ్ళి కొడుకు.. బంగారు షూలు.. బంగారు టై..!

పాకిస్థానీ పెళ్ళి కొడుకు తన రేంజి ఏంటో చూపించాలని చేసిన ప్రయత్నం ప్రపంచ వ్యాప్తంగా వైరల్ అవుతోంది. పాకిస్థాన్ లోని లాహోర్ లో అతడి పెళ్ళి జరిగింది. అందులో అతడు ధరించిన టై, షూల గురించే అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎందుకంటే అవి బంగారంతో తయారు చేసినవి. హఫీజ్ సల్మాన్ షాహిద్ అనే పెళ్ళి కొడుకు దాదాపు 25లక్షల రూపాయల బంగారాన్ని తన ఒంటి మీద ధరించాడు.

సల్మాన్ తన పెళ్ళి రిసెప్షన్ కు సూటు వేసుకొని హాజరు అయ్యాడు. అయితే అతడు వేసుకున్న టై, షూ మాత్రం పూర్తీ బంగారంతో తయారు చేయించారట. అతడి సూట్ ధర 63వేల రూపాయలు అయితే.. 17లక్షల రూపాయలు పెట్టి చేయించుకున్న బంగారు షూలు వేయించుకున్నాడు. తన పెళ్ళి రోజు ఏదైనా కొత్తగా చేయాలని అనుకునే వాడినని అనుకున్నట్లుగానే బంగారు షూలు, టై రెడీ చేయించానని చెప్పుకొచ్చాడు. సల్మాన్ కు ఏడుగురు అక్కచెల్లెళ్ళు ఉన్నారట. ఉన్న ఒక్కగానొక్క కొడుకు కోరికలు తీర్చాలని భావించిన సల్మాన్ తల్లిదండ్రులు అతడికి ఇష్టం వచ్చింది చేసుకోమని చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here