ఎంతో మంది ప్రాణాలను కాపాడిన నర్సును.. అన్యాయంగా కాల్చి చంపేశారు..!

రజన్ అల్ నజ్జర్.. 21 ఏళ్ల నర్సును అన్యాయంగా కాల్చి చంపేశారు. గాజాలో నిరసనలు జరుగుతుండగా 100 మందిపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులకు దిగింది. ఆ సమయంలో రజన్ కూడా అక్కడే ఉంది. దీంతో ఆమెకు కూడా తూటాలు తగిలి ప్రాణాలు కోల్పోయింది.

21 ఏళ్ల రజన్ చాలా కాలంగా నర్సులా పనిచేస్తోంది. ఎన్నో సార్లు ఆమె పాలస్తీనీయులకు చికిత్స చేస్తుండగా ఫోటోలు తీశారు కూడానూ..! ఎంతో మందిని కాపాడిందని రజన్ కు పేరు కూడా ఉంది. అలాంటి ఆమెను అన్యాయంగా చంపేశారని ఆమె తోటి నర్సులు.. అక్కడి ప్రజలు చెప్పారు.

గత కొన్ని ఏళ్ళుగా ఆ ప్రాంతంలో నిరసనలు జరుగుతూ ఉన్నాయి. ఈ ఏడాది మార్చి 30 నుండి మరోసారి గొడవలు మొదలయ్యాయి.. మే 14న అవి తారాస్థాయికి చేరాయి. ఇప్పటిదాకా 61 మంది చనిపోయారు. చాలా మందికి గాయాలు కూడా అయ్యాయి. అలా గాయపడ్డ ఎంతో మందికి రజన్ చికిత్స చేసింది. కానీ శుక్రవారం ఆమె కూడా నిరసనల్లో పాల్గొనడంతో ఆమెపై ఇజ్రాయెల్ సైన్యం దాడి చేయడంతో ఆమె మరణించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here