ఫైనల్ లో తలబడ్డ ఆ ఇద్దరిదీ ఒకే ఊరు.. తమ ఊరి కుర్రాడి బౌలింగ్ లో బౌల్డ్..!

భారత కుర్రాళ్ళు అనుకున్నది సాధించారు. అండర్-19 వరల్డ్ కప్ ను నాలుగోసారి భారత్ కు తీసుకొనివచ్చారు. భారత ఆటగాళ్ళు ప్రతి ఒక్కరూ అద్భుతంగా రాణించారు ఈ వరల్డ్ కప్ లో..! ఇక శుభమన్ గిల్ భారత్ తరపున టోర్నీలో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అన్ని మ్యాచ్ లూ అద్భుతంగా ఆడిన గిల్ ఫైనల్ లో మాత్రం కాస్త తక్కువ పరుగులకే అవుట్ అయ్యాడు. అయితే గిల్ అవుటయింది తమ ఊరి కుర్రాడి చేతుల్లోనే అంటే నమ్మరేమో..!

ఆస్ట్రేలియా జట్టులో ఉన్న పరమ్ ఉప్పల్ భారత సంతతికి చెందిన ఆటగాడు. అతడు మొహాలీకి చెందిన వాడు.. భారత్ అండర్-19 స్టార్ శుభమన్ గిల్ కూడా మొహాలీకి చెందినవాడే..! అలా తమ ఊరి కుర్రాడి చేతిలోనే గిల్ ఫైనల్ లో బౌల్డ్ అయ్యాడు. పరమ్ ఉప్పల్ తండ్రి దేవేంద్ర సింగ్ 2003 లో మొహాలీ నుండి ఆస్ట్రేలియాకు వెళ్ళాడు. హర్యానా హైకోర్టులో దేవేంద్ర సింగ్ ఉప్పల్ చాలా సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేసి 2003లో సిడ్నీకి వెళ్ళాడు. అక్కడ రైల్వేస్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం దొరికింది. దేవేంద్ర ఉప్పల్ భార్య జస్ప్రీత్ అక్కడే టీచర్ గా పనిచేస్తోంది. పిల్లాడు పరమ్ ఉప్పల్ ను తమతో పాటూ ఆస్ట్రేలియాకు తీసుకొని వెళ్ళారు.

పరమ్ ఉప్పల్ ఆస్ట్రేలియాకు వెళ్ళినప్పుడు అతడి వయసు 3 సంవత్సరాలు. అక్కడే క్రికెట్ కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టిన ఉప్పల్ క్రికెట్ లో రాణించడం మొదలుపెట్టాడు. స్పిన్నర్ గా మంచి ప్రదర్శన ఇవ్వడంతో అతడికి మెల్లమెల్లగా గుర్తింపు రావడం మొదలైంది. దీంతో నేషనల్ లెవల్ ఆటగాడిగా గుర్తింపు సంపాదించాడు. ఆ తర్వాత న్యూ సౌత్ వేల్స్ బ్లూ, సిడ్నీ థండర్స్ జట్టుతో కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. మంచి ప్రదర్శన ఇవ్వడంతో అండర్-19 ప్రపంచకప్ ఆస్ట్రేలియా జట్టులో స్థానం సంపాదించాడు. ఫైనల్ లో అద్భుతమైన బంతితో వరల్డ్ కప్ హీరో శుభమన్ గిల్ ను అవుట్ చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here