పెళ్లైన వ్య‌క్తిని ప్రేమించి..పెళ్లాడింది! అత్త‌వారింట్లో అడుగు పెట్టిన త‌ర్వాత అస‌లు విష‌యం తెలిసి!

పెళ్ల‌యిన ఓ వ్య‌క్తిని ప్రేమించిందో యువ‌తి. కుటుంబ స‌భ్యుల‌తో గొడ‌వ ప‌డి మ‌రీ అత‌ణ్ని పెళ్లి చేసుకుంది. తీరా అత్తింట్లో అడుగు పెట్టిన త‌రువాత గానీ ఆమెకు అస‌లు విష‌యం తెలియ‌రాలేదు. త‌న భ‌ర్త ఓ విమెనైజ‌ర్ అని, మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడే విష‌యం తెలిసి నిర్ఘాంత‌పోయింది. దీనికితోడు- అత‌ని త‌ల్లి పెట్టే వేధింపుల‌ను భ‌రించ‌లేక ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఉరి వేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది.

ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని కోలార్ జిల్లాలో చోటు చేసుకుంది. మృతురాలి పేరు దివ్య‌. వ‌య‌స్సు 23 సంవ‌త్స‌రాలు. జిల్లాలోని ముళ‌బాగిలు మండ‌లానికి చెందిన దివ్య‌.. అదే మండ‌లం క‌ప్ప‌ల‌మ‌డుగు గ్రామానికి చెందిన రామ‌చంద్ర అనే వ్య‌క్తిని ప్రేమించారు. మూడేళ్ల కింద‌ట‌ రెండో వివాహం చేసుకున్నారు. ఇంట్లో వారు ఒప్పుకోనప్ప‌టికీ ఆమె గొడ‌వ ప‌డి మ‌రీ రామ‌చంద్ర‌ను పెళ్లాడారు.

అత్త‌గారింట్లో అడుగు పెట్టిన త‌రువాత గానీ ఆమెకు అస‌లు విష‌యం బోధ‌ప‌డ‌లేదు. రామ‌చంద్ర‌కు అదే గ్రామానికి చెందిన మ‌రో మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం ఉంద‌ని తేలింది. ఈ విష‌యంపై ఆమె త‌రచూ రామ‌చంద్ర‌తో ఘ‌ర్ష‌ణ ప‌డుతుండేవారు. ఈ విష‌యంలో ఆమె అత్త రాధ‌మ్మ‌.. కుమారుడికే వ‌త్తాసు ప‌ల‌క‌డంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైంది.

భ‌ర్త‌లో మార్పు వ‌స్తుంద‌ని భావించిన‌ప్ప‌టికీ.. అత‌ను మార‌లేదు. దీనితో జీవితంపై విర‌క్తి చెంది ఆమె ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి ముందు- ఆమె ఫేస్‌బుక్‌లో దీనికి సంబంధించిన స‌మాచారాన్ని పోస్ట్ చేశారు. మ‌రికొన్ని గంట‌ల్లో త‌న మ‌ర‌ణ వార్త వింటార‌ని ఆమె పోస్ట్ చేశారు. ఈ ఘ‌ట‌న‌పై ముళ‌బాగిలు పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here