ప్రేమించానని చెప్పిన కూతురు.. ఒప్పుకోని తల్లిదండ్రులు.. ముగ్గురూ ఒకేసారి..!

గుంటూరుకు చెందిన కుటుంబం ఖమ్మం జిల్లా లోని మధిరలో ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. తల్లి, తండ్రి, కూతురు ముగ్గురూ కలిసి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. అందుకు కారణం తల్లిదండ్రులు తీసుకొని వచ్చిన సంబంధానికి కూతురు ఒప్పుకోకపోవడమే కాకుండా.. తాను వేరే వ్యక్తిని ప్రేమిస్తున్నానని చెప్పింది. దీంతో తల్లిదండ్రులు తమ పరువు తీసావు కదా అని ట్రైన్ కింద పడ్డారు. వారితో పాటే కూతురు కూడా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం..యువతి కృష్ణ వేణి మధిరలో ఫ్యాషన్ టెక్నాలజీ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు దుంగా వెంకటయ్య, భార్య రజనీ కృష్ణ వేణికి పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు. అయితే కృష్ణవేణి తాను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నానని.. అతన్నే పెళ్ళి చేసుకుంటానని చెప్పింది. ఇది తల్లిదండ్రులకు అసలు నచ్చలేదు. తాము చెప్పింది చేయాలని కృష్ణవేణికి చెప్పారు. ఆమె కూడా ప్రేమించిన వ్యక్తిని తప్పితే వేరే వాళ్ళను పెళ్ళి చేసుకోనని చెప్పేసింది. నువ్వు కానీ పెళ్ళి చేసుకుంటే పరువు పోతుందని.. పరువు పోవడం కంటే మా ప్రాణాలు పోవడమే మంచిదని వాళ్ళు కృష్ణవేణికి తెలిపారు. ఇదే విషయమై గొడవ జరుగుతుండగా మధిర రైల్వే స్టేషన్ లో వాళ్ళు ట్రైన్ కింద దూకి చనిపోయారు. వాళ్ళను ఆపే క్రమంలో కృష్ణవేణి కూడా ట్రైన్ కింద పడింది. ముగ్గురి ప్రాణాలు ఘటనాస్థలంలోనే పోయాయి. ప్రస్తుతం వాళ్ళ మృతదేహాలను గుంటూరుకు తరలించారు. ఇక ఆ కుటుంబంలో మిగిలింది కృష్ణ వేణి తమ్ముడు ఒక్కడే.. అతడు ఇంటర్ చదువుతూ ఉన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here