ముస‌లాడ్ని తీసుకొచ్చి పెళ్లాడ‌మంటే నిరాక‌రించిన కుమార్తె! దారుణానికి పాల్ప‌డిన త‌ల్లిదండ్రులు

శాన్ ఆంటోనియో: తాము చూసిన యువ‌కుడిని పెళ్లాడ‌టానికి నిరాక‌రించిన ఓ బాలిక‌పై అమాన‌వీయంగా ప్ర‌వ‌ర్తించారు ఆమె త‌ల్లిదండ్రులు. వేడి నూనెను ముఖంపై పోశారు. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ ఆ బాలిక‌ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది. దీనికి కార‌ణ‌మైన త‌ల్లిదండ్రుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘ‌ట‌న అమెరికాలోని శాన్ ఆంటోనియోలో చోటు చేసుకుంది.

ఇరాక్‌కు చెందిన ఆమె కుటుంబం రెండేళ్ల కింద‌ట అమెరికాకు వ‌ల‌స వ‌చ్చింది. టెక్సాస్ ద‌క్షిణ ప్రాంతంలోని శాన్ ఆంటోనియోలో నివసిస్తోంది. బాధితురాలి పేరు అల్ హిష్మావి. 16 సంవ‌త్స‌రాల ఆ బాలిక బెక్స‌ర్ కంట్రీలోని త‌ఫ‌త్ హైస్కూల్‌లో చ‌దువుకుంటోంది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో 30న ఆమె కంటే వ‌య‌స్సులో నాలుగింత‌లు ఉన్న ఓ వ్య‌క్తిని తీసుకొచ్చి, పెళ్లి చేసుకోవాల‌ని ఆదేశించారు.

దీనికోసం వారు ఆ వ్య‌క్తి నుంచి భారీగా డ‌బ్బుల‌ను కూడా తీసుకున్నారు. అత‌ణ్ని పెళ్లి చేసుకోవ‌డానికి ఆమె నిరాక‌రించింది. దీనితో వారు దారుణంగా ప్ర‌వ‌ర్తించారు. తండ్రి అబ్దుల్ ఫ‌హ్మి హిష్వామి, త‌ల్లి హ‌మ్దియా సహ అల్ హిష్వామి త‌మ కుమార్తెను బంధించి, దారుణంగా కొట్టారు. ఆమెపై వేడి నూనె పోశారు. ఈ ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ ఆమె ఆసుప‌త్రి పాల‌య్యారు.

ఇంట్లోంచి పారిపోయిన ఆమె త‌న స్నేహితులను ఆశ్ర‌యించగా, వారు ఆసుప‌త్రిలో చేర్చారు. శ‌నివారం ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జి అయిన బాధిత బాలిక పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో ఈ విష‌యం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. నిందితుల‌ను పోలీసులు అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here