సంచలన వ్యాఖ్యలు చేసిన రేణుకా చౌదరి..!

దేశ వ్యాప్తంగా క్యాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడుకుంటున్నారు. అవకాశాల కోసం తమను కొందరు వాడుకున్నారని ఆరోపణలు గుప్పిస్తూ ఉన్నారు. ఈ అంశాలపై కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరి కూడా మాట్లాడారు. అయితే ఏకంగా ఈ అంశం లోకి పార్లమెంట్ ను లాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ లో కూడా క్యాస్టింగ్ కోచ్ ఉందనే అర్థం వచ్చేలా ఆమె వ్యాఖ్యానించారు.

క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం సినీ పరిశ్రమలో మాత్రమే లేదని.. అన్ని చోట్లా ఉందని అన్నారు. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో పార్టమెంట్ అతీతమని భావించవద్దని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతి చోటా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయని అని చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారంపై దేశమంతా ఒక్కతాటిపైకి వచ్చి పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై బాలీవుడ్ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ రేణుక ఈ వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here