యూనివ‌ర్శిటీ స్టూడెంట్‌: విమానంలో బ‌ట్ట‌లు విప్పేసి, ల్యాప్‌టాప్‌లో పోర్న్ వీడియోలు చూస్తూ టైమ్‌పాస్‌!

డాకా: బంగ్లాదేశ్‌కు చెందిన విద్యార్థి అత‌ను. నిండా 20 ఏళ్లు కూడా లేవు. మ‌లేసియాలోని ప్ర‌తిష్ఠాత్మ‌క విశ్వ‌విద్యాల‌యంలో ఉన్న‌త చదువును అభ్య‌సిస్తున్నాడు.

సెల‌వుల సంద‌ర్భంగా స్వ‌దేశానికి బ‌య‌లుదేరిన అత‌ను.. కౌలాలంపూర్‌లో మ‌లిండో ఎయిర్‌వేస్ విమానం ఎక్కాడు. ఆ విమానంలో అత‌ను ఢాకా వెళ్లాల్సి ఉంది. విమానం ఎక్కిన ఆ విద్యార్థికి టైమ్‌పాస్ కాలేద‌ట‌. అందుకే- వెంట తెచ్చుకున్న ల్యాప్‌టాప్‌లో పోర్న్ వీడియోల‌ను చూడ‌టం మొద‌లు పెట్టాడు. అక్క‌డితో ఆగ‌లేదు.

 

ఒంటి మీద బ‌ట్ట‌ల‌న్నీ విప్పేశాడు. ల్యాప్‌టాప్‌లో పోర్న్ వీడియోల‌ను చూస్తూ త‌న పైత్యాన్ని, పైశాచిక‌త్వాన్ని ప్ర‌ద‌ర్శించాడు. తోటి ప్ర‌యాణికుల ప‌ట్ల అభ్యంత‌ర‌కంగా ప్ర‌వ‌ర్తించాడు. అత‌ణ్ణి అడ్డుకోవ‌డానికి ప్ర‌య‌త్నించిన విమానం సిబ్బంది ప‌ట్ల కూడా అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించాడు. ఓ మ‌హిళా స్టివ‌ర్డ్‌ను కౌగిలించుకునే ప్ర‌య‌త్నం చేశాడు.

 

ఈ ఘ‌ట‌న‌తో నిర్ఘాంత‌పోయిన ప్ర‌యాణికులు, విమాన సిబ్బంది.. అత‌ణ్ణి తాడుతో సీటుకు క‌ట్టేశారు. విమానం ఢాకాలోని హ‌జ్ర‌త్ షాజ‌లాల్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో దిగిన వెంట‌నే పోలీసులు ఆ విద్యార్థిని అరెస్టు చేశారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here