పాస్ పోర్టుల విషయంలో షాకింగ్ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం..!

పాస్ పోర్టుల విషయంలో కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అదేంటంటే ఇప్పటిదాకా అడ్రెస్ ప్రూఫ్ ల కోసం పాస్ పోర్టులను మనం ఇచ్చే అవకాశం లేకుండా పోతుంది. ఇకపై పాస్ పోర్టు చివరి పేజీలో చిరునామా వివరాలను ముద్రించకుండా, ఖాళీగా వదిలేయాలని నిర్ణయించింది. ఇది అమల్లోకి వస్తే అడ్రస్ ప్రూఫ్ లకు ఇకపై పాస్ పోర్టులు పనికిరాకుండా పోతాయి. కొన్ని కొన్ని సార్లు అడ్రెస్ ప్రూఫ్ ల విషయంలో పాస్ పోర్టులను ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ ఇకపై అది కుదరదు.

పాస్ పోర్ట్ మరియు వీసా డివిజన్ లో పాలిసీ మరియు లీగల్ వ్యవహారాల అండర్ సెక్రటరీగా బాధ్యతలను నిర్వహిస్తున్న సురీందర్ కుమార్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. తదుపరి సిరీస్ పాస్ పోర్టులను ఇష్యూ చేసే సమయంలో ఈ నిర్ణయాన్ని అమలు చేయబోతున్నామని ఆయన తెలిపారు. పాస్ పోర్ట్ దారుడి వివరాలను గోప్యంగా ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అలాగని వివరాలు వాళ్లకు ఎలా తెలుస్తాయి అని అనుకోకండి 2012 నుంచి పాస్ పోర్టులపై బార్ కోడ్ ఉంటోంది. ఈ బార్ కోడ్ ను స్కాన్ చేస్తే వివరాలన్నీ కంప్యూటర్ లో బయటపడతాయి. పాత పాస్ పోర్టులను గడువు ముగిసే వరకు వినియోగించుకోవచ్చని… రెన్యువల్ సమయంలో ఈ మార్పులు వర్తిస్తాయని చెప్పారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here