కార‌ణ‌మేంటో తెలియ‌ట్లేదు గానీ.. ఆసుప‌త్రి బాత్‌రూమ్‌లో ఉరి!

భువ‌నేశ్వ‌ర్‌: కార‌ణాలు తెలియ‌రావ‌ట్లేదు గానీ ఆసుప‌త్రిలో చేరిన ఓ యువ‌కుడు మేల్ వార్డు టాయ్‌లెట్‌లో అనుమానాస్ప‌ద స్థితిలో మ‌ర‌ణించాడు. టాయ్‌లెట్‌లో ఉరి వేసుకున్న స్థితిలో క‌నిపించాడు.

బుధ‌వారం తెల్ల‌వారు జామున మ‌రుగుదొడ్డికి వెళ్లిన రోగి బంధువు ఒక‌రు మొద‌ట‌గా ఈ దృశ్యాన్ని చూశారు. వెంట‌నే ఆసుప‌త్రికి సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. ఒడిశాలోని పూరి జిల్లా ప్ర‌భుత్వ ప్ర‌ధాన ఆసుప‌త్రిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.

 

మృతుడి పేరు బ‌బులా స‌బ‌ర్‌. తాపీ మేస్త్రీగా ప‌నిచేస్తుండేవాడు. నౌపాడ జిల్లాకు చెందిన బ‌బులా ఉపాధి కోసం పూరి న‌గ‌రానికి వ‌చ్చాడు. త‌న స్నేహితులు, తోటి భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌తో క‌లిసి పూరీలోని మాటిపాడా ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు.

 

రెండురోజుల కింద‌ట ఛాతీ నొప్పితో జిల్లాసుప‌త్రిలో చేరాడు. అక్క‌డ చికిత్స తీసుకుంటుండ‌గానే.. బుధ‌వారం తెల్ల‌వారు జామున ఆసుప‌త్రి బాత్‌రూమ్‌లో మృత‌దేహ‌మై క‌నిపించాడు. ఈ ఘ‌ట‌న‌పై స్థానిక పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here