ఆనం వివేకానంద రెడ్డి మరణం తీవ్ర ఆవేదన కలిగించిందన్న పవన్ కళ్యాణ్..!

ప్రముఖ తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానంద రెడ్డి మరణించిన సంగతి తెలిసిందే.. పలువుర్ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

‘మాజీ ఎమ్మెల్యే, మా కుటుంబానికి ఆత్మీయుడు ఆనం వివేకానంద రెడ్డి మృతి నాతో పాటు నా కుటుంబానికి తీవ్ర ఆవేదనను కలిగించింది’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఆనం కుటుంబానికి చెందిన వివేకానంద రెడ్డి మరణించడం చాలా బాధ కలిగించిందని.. ఈ సందర్భంగా వివేకానంద రెడ్డికి నివాళి అర్పిస్తూ ఆయన ఆత్మకు ఆ భగవంతుడు శాంతిని చేకూర్చాలని ప్రార్థిస్తున్నాను. వివేకానంద రెడ్డి కుటుంబానికి నా తరఫున, జనసేన పార్టీ తరపున ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానను అని తన ప్రకటన వెలువరించారు పవన్ కళ్యాణ్.

ఆయన అంతిమ సంస్కార కార్యక్రమంలో జనసేన పార్టీ ప్రతినిధిగా జనసేన పార్టీ రాజకీయ సలహా సంఘం కన్వీనర్, సీనియర్ రాజకీయవేత్త మాదాసు గంగాధరం పాల్గొంటారు. వివేకానంద అంతిమ యాత్రలో జనసేన కార్యకర్తలు ఆయనకు నివాళులు అర్పిస్తారని పవన్ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here