పవన్ కళ్యాణ్ అనంతపురం పర్యటన రద్దు.. కంటికి ఇన్ఫెక్షన్..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు అనంతపురం జిల్లాకు రావాల్సి ఉండేది. అయితే ఆ పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఎడమ కంటికి డస్ట్ ఇన్ ఫెక్షన్ సోకడంతో, డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో పవన్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ అద్దాలు పెట్టుకునే కనపడుతూ ఉన్నారు.. మొన్న జరిగిన రంగస్థలం సక్సెస్ ఈవెంట్ లో కూడా పవన్ కళ్యాణ్ నల్ల కళ్ళజోడు పెట్టుకొని వచ్చాడు. అందుకు కారణం ఆయనకు వచ్చిన కంటి ఇన్ఫెక్షనే.. దీంతో పవన్ నేటి అనంతపురం పర్యటనను రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.

అనంతపురంలో పార్టీ కార్యాలయానికి భూమి పూజ చేయగా, ప్రస్తుతం దాని నిర్మాణం శరవేగంగా సాగుతోంది. అనంతపురం పట్టణ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయవచ్చని కూడా ఊహాగానాలు వస్తున్నప్పటికీ, వాటిపై అధికారిక సమాచారం లేదు. అనంతపురం జిల్లాపై ప్రత్యేక దృష్టిని సారించిన పవన్, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని అన్ని స్థానాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే జిల్లాలో క్షేత్ర స్థాయిలో జనసేనను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టిన ఆయన, ఇప్పటికే పలుమార్లు అనంతపురం, హిందూపురం తదితర పట్టణాల్లో పర్యటనలు జరిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here