పవన్ కళ్యాణ్ పోస్ట్ చేసిన ‘బొంబాయి లో అంతే.. బొంబాయి లో అంతే’ కథ..!

పవన్ కళ్యాణ్ గత కొద్ది రోజులుగా కొందరు మీడియా ప్రతినిధుల గురించి ప్రత్యేకంగా ట్వీట్లు పెడుతూ వస్తున్నారు. ఈరోజు కూడా గుడ్ మార్నింగ్ నుండి వరుసగా ట్వీట్లు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు ఆయన పోస్ట్ చేసిన ‘బొంబాయి లో అంతే.. బొంబాయి లో అంతే’ కథ గురించి నెటిజన్లు చర్చించుకుంటూ ఉన్నారు.

ఇంతకూ ఆ కథ ఏమిటంటే.. ఒక సినిమాలో విలన్లు ఎలాంటి తప్పుడు పని చేసినా.. ఏంటి ఇది అని ఎవరు అన్నా పక్కన ఉన్న కమెడియన్ పాత్ర ‘బొంబాయి లో అంతే.. బొంబాయి లో అంతే’ అని అంటూ ఉంటాడట. అలాగే ఈ ‘బూతురత్నం’ అంటాడు.. ‘పవన్ కళ్యాణ్ తల్లిని దూషించే తిట్టు, పల్లెటూళ్ళలో చాలా సర్వ సాధారణం అంట.. మరి ఈ లాజిక్ బట్టి.. ఇతనిని ప్రజలందరూ అలా పిలిచినా తప్పు అనుకోడు. ప్రజలుగా మీరు అతను స్వయంగా ఒప్పుకున్నా లాజిక్ ప్రకారం, లైసెన్స్ ప్రకారం మీరు విచ్చలవిడిగా, స్వేచ్ఛగా బూతురత్నని అలా ముద్దుగా పిలుచుకోవచ్చు.. అతడు బాధపడడు.. ఆయన నవ్వుకుంటూ పల్లెటూళ్ళలో అంతే.. పల్లెటూళ్లలో అంతే అని బూతు పలుకులు రాస్తూ కూర్చుంటాడు..!

కానీ అతను ఇచ్చిన లైసెన్సుని అతని వరకే పరిమితమవుతుందా లేదా అనేది మనం వేచి చూడాలని పవన్ కళ్యాణ్ తన ట్వీట్ లో చెప్పుకొచ్చాడు. ఇంతకూ ఆ ‘బూతురత్నం’ ఎవరో అందరికీ అర్థం అయ్యే ఉంటుంది అని కింద కామెంట్లు వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here