సీపీఎం మధు చొక్కాను మోసిన పవన్ కళ్యాణ్..!

ఏపీపై కేంద్రం అవలంభిస్తున్న వైఖరిని నిరసిస్తూ సీపీఎం, సీపీఐ, జనసేన పార్టీలు విజయవాడలో ఈరోజు పాదయాత్ర నిర్వహించాయి. బెంజి సర్కిల్ నుంచి జాతీయ రహదారి మీదుగా రామవరప్పాడు వరకూ సాగిన ఈ పాదయాత్రలో సీపీఎం మధు, పీపీఐ రామకృష్ణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

ఈ పాదయాత్రలో సీపీఎం నేత మధు చొక్కాను పవన్ కళ్యాణ్ మోయడం విశేషం. బాగా చెమటలు పట్టడంతో మధు తన చొక్కాను తీసేసి బనియన్ తోనే పాదయాత్ర కొనసాగించారు. మధు చొక్కాను పవన్ తన చేతిపై వేసుకుని కలిసి నడుచుకుంటూ వెళ్ళారు. పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సింప్లిసిటీని చూసి తెగ ఆనందిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసుకుంటూ ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here