పవన్ కళ్యాణ్ అభిమానులు 15వ తేదీ వరకూ ఓపిక పట్టండి..!

సినీ విశ్లేషకుడు కత్తి మహేశ్ – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న వార్ విషయంలో పవన్ కళ్యాణ్ అభిమానులు 15వ తేదీ వరకూ ఓపిక పట్టండని సినీ రచయిత, నిర్మాత, దర్శకుడు కోన వెంకట్ తెలిపారు.

https://twitter.com/konavenkat99/status/950015153491214337

మౌనం ఎప్పటికీ మోసం చేయదని పేర్కొన్నారు. పవన్ అభిమానులతోపాటు, కత్తి మహేశ్ కూడా మౌనంగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. మీడియా హౌస్‌లకు వెళ్లి పవన్ కళ్యాణ్ అభిమానుల గురించి, పవన్ వ్యక్తిగత జీవితం గురించి వ్యతిరేక ప్రసంగాలు ఇవ్వవద్దని కత్తిని కోరారు. అలా చేసినట్టయితే ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలనుకుంటున్న తన ప్రయత్నం విఫలమవుతుందన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా పవన్ అభిమానులకు ఓ సూచన చేశారు. 15వ తేదీన ఆయన ఏం చేయబోతున్నారనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఆ ట్వీట్ మీకోసం..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here