పవన్ కళ్యాణ్ షర్ట్ మీద కూడా వార్తేనా..?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ షర్ట్ గురించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది. అదేమిటంటే.. ఎప్పుడూ తెలుగు రంగు బట్టలు వేసుకొని జనాల్లోకి వచ్చే పవన్ కళ్యాణ్ ఎందుకు గ్రీన్ కలర్.. అదే మిలటరీ రంగు బట్టలు వేశాడు అని..!

అయితే దీనిపై సోషల్ మీడియాలో పుకారు కూడా మొదలైంది. పవన్ కళ్యాణ్ జోతిష్యాన్ని ఎక్కువగా నమ్ముతారని.. ఓ సిద్ధాంతి చెప్పారనే ముదురు ఆకుపచ్చ రంగు దస్తులు ధరించారని వార్తలు వచ్చాయి.. పవన్ కళ్యాన్ జ్యోతిష్యుడి మాటలను నమ్మే యాత్రలో ఇలా డిఫెరెంట్ దుస్తులను ధరిస్తున్నట్టు ప్రచారం జరిగింది. చివరికి ఇది ఆ నోటా.. ఈ నోటా పాకి పవన్ కళ్యాణ్ చెవిన పడింది. అప్పుడు పవన్ వివరణ ఇచ్చాడు..! ‘శ్రీకాకుళం జిల్లా నుంచి చాలామంది భారతసైన్యంలో చేరారని.. ఈ దేశంలోనే భారత మాత దేవాలయంగా శ్రీకాకుళం నిలిచిందని.. అందుకే సేవ చేస్తున్న శ్రీకాకుళం సైనికులకు భరోసానిచ్చేందుకే తాను వారు వేసుకునే దుస్తులు ధరించానని’ చెప్పుకొచ్చాడు.

శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఉన్న పవన్ ఎచ్చెర్ల మండలం సంతసీతారాంపురం ప్రాంతంలోని ఓ రిసార్టులో బసచేస్తున్నారు. నిన్న టెక్కలిలో పర్యటనను ముగించుకుని సాయంతం, 6.45 గంటల ప్రాంతంలో పవన్ రిసార్టు వద్దకు రాగా, అప్పటికే ఆయన అభిమానులు భారీ సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరారు. తమను పలకరించేందుకు పవన్ ఒక్కసారైనా బయటకు వస్తారని అభిమానులు ఆశించగా, పవన్ బయటకు రాలేదు. దీంతో రాత్రి బాగా పొద్దుపోయేవరకూ వేచి చూసి.. చూసి అలసిపోయిన అభిమానులు ఆపై నిరుత్సాహంతో వెనుదిరిగారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here