పవన్ కళ్యాణ్ మనోడు.. బాగా చూసుకోండన్న కేసీఆర్.. ఎందుకు ఆ మాట అన్నారు..!

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రగతి భవన్ లో అర్థ గంట పాటు వెయిట్ చేసి మరీ కేసీఆర్ ను కలిసి వెళ్లారు పవన్. వీరిద్దరూ గంట పైగా మాట్లాడుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సహృద్భావ వాతావరణంలో కలిశానని పవన్ అన్నారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపానని, తెలంగాణలో వ్యవసాయానికి నిరంతర విద్యుత్ అందిస్తున్న కేసీఆర్ ను ప్రత్యేకంగా అభినందించినట్లు జనసేనాని చెప్పుకొచ్చారు.

పవన్ పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు కురిపించడం విశేషమే. వవన్ కళ్యాణ్ మన వ్యక్తే అని.. ఇకపై పవన్ ను బాగా చూసుకోండని టీఆర్ఎస్ శ్రేణులకు, కార్యకర్తలకు ఆయన సూచించడం విశేషం. భేటీ సమయంలో రాజకీయ అంశాలు, సమస్యలపై వీరిద్దరూ చర్చించారు. పవన్ ను బాగా చూసుకోవాలన్న కేసీఆర్ వ్యాఖ్యలు రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బాగా చూసుకోవడం అంటే ఏమిటో తమకు అర్థం కావడం లేదని కార్యకర్తలే అంటున్నారట. పవన్ ను భోజనం చేయాలని కేసీఆర్ కోరినప్పటికీ, పవన్ వద్దన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here