పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ తాంత్రిక పూజలపై నిజం ఇదే..!

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ లు కలిసి తాంత్రిక పూజలు చేశారని.. ఆ పూజలు చేసింది నరసింహ అనే పురోహితుడు అని కత్తి మహేష్ చెప్పడం తీవ్ర వివాదం అయింది. అందుకు సంబంధించిన వీడియో తన వద్ద ఉందని.. అవసరమైనప్పుడు తాను విడుదల చేస్తానని చెప్పుకొచ్చాడు. అయితే అదంతా అబద్దమని తేలిపోయింది.

కత్తి మహేశ్ చెప్పినట్టు పవన్, త్రివిక్రమ్ చేసింది తాంత్రిక పూజలు కాదని, నరసింహస్వామి ఆలయంలో యాగం సందర్భంగా నిర్వహించిన పూజలని తేలింది. ఇందుకు సంబంధించిన సమాచారం ప్రకారం, పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల మండలం ఎస్.జగన్నాథపురంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి ఏటా మహా సంపుటిత, శ్రీ జ్వాల నరసింహస్వామి సుదర్శన యాగం నిర్వహించడం ఆనవాయతీ.

మహాశివరాత్రి ముందు రోజు, మహాశివరాత్రి రోజున ఈ యాగం నిర్వహిస్తుంటారు. ఇక్కడి స్వామి వారిపై త్రివిక్రమ్ కు నమ్మకం ఎక్కువ. దీంతో, ఇక్కడ ప్రతి ఏటా నిర్వహించే యాగానికి ఆయన హాజరవుతుంటారు. ఆ సమయంలో తాను ఏ సినిమాకు అయితే దర్శకత్వం వహిస్తున్నాడో, ఆ సినిమా యూనిట్ లోని ముఖ్యులను ఈ యాగానికి ఆయన ఆహ్వానిస్తుంటారు. 2009లో ఈ యాగంలో పవన్-త్రివిక్రమ్ పాల్గొన్నారని, 2014లో త్రివిక్రమ్ తో పాటు నటుడు స్నేహితుడైన సునీల్ కూడా ఇక్కడికి వచ్చారని అక్కడి పండితులు చెబుతున్నారు.

అయితే కత్తి మహేష్ వద్ద ఉన్నది ఈ పూజలకు సంబంధించిన వీడియోలా.. లేక వేరే వీడియోలా అన్నది అతడు బయటపెట్టే వీడియోల మీద ఆధారపడి ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here