పవన్ కళ్యాణ్ మీడియాను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడట..!

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొన్ని మీడియా సంస్థల తీరుపై తన ట్విట్టర్ అకౌంట్ లో ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతూ వస్తున్నాడు. అందుకు ముఖ్య కారణం కొన్ని మీడియా సంస్థల్లో కావాలనే పవన్ మీద కొన్ని వ్యాఖ్యలు చెయడం.. అయితే ఆయన తీరును ఖండిస్తున్నారు కొందరు. అలాగే ఇప్పటికే ఏబీఎన్ సంస్థ పవన్ మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వారికి మద్దతు తెలిపిన టీయూడబ్ల్యూజే నేత క్రాంతికిరణ్.. పవన్ కళ్యాణ్ తీరును ఖండించడమే కాకుండా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

సామాజిక మాధ్యమాల్లో పవన్ కల్యాణ్ చేసే పోస్టులకు పొంతన ఉండదని, తాగి ఆ సందేశాలు పెడతారో లేక డ్రగ్స్ తీసుకుని పెడతారో అర్థం కావట్లేదంటూ క్రాంతికిరణ్ అన్నారు. మీడియాను తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని పవన్ చూస్తున్నారని, మీడియాను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని విమర్శించారు. మీడియా సంస్థలకు పవన్ కళ్యాణ్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేదంటే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ కారణంగా రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందని, హైదరాబాద్ నుంచి ఆయన్ని పంపించి వేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here