పయ్యావుల కేశవ్ కు పితృ వియోగం.. సంతాపం తెలిపిన చంద్రబాబు..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాసనమండలి ఛీప్ విప్ పయ్యావుల కేశవ్ కు పితృ వియోగం. పయ్యావుల కేశవ్ తండ్రి మాజీ ఎమ్మెల్యే అయిన పయ్యావుల వెంకట నారాయణప్ప ఈరోజు సాయంత్రం మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతూ అనంతపురంలోని ఓ ప్రైవేటు ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అక్కడే తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు. తన తండ్రి కన్ను మూశారని తెలుసుకున్న పయ్యావుల కేశవ్‌ అమరావతి నుంచి బయలుదేరి అనంతపురం వెళ్లారు. పయ్యావుల వెంకట నారాయణ కూడా రాజకీయా నాయకుడే. గతంలో ఆయన రాయదుర్గం నియోజక వర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికయి సేవలందించారు.

ఉరవకొండ మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన పయ్యావుల వెంకట నారాయణప్ప 1975 సంవత్సరం లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా 37,108 ఓట్లతో రాయదుర్గం ఎమ్మెల్యే గెలుపొందారు. నవంబర్ 9వతేదీ 1932 సంవత్సరం జన్మించారు. మొదట్లో ఆయన అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గా పనిచేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గా పనిచేశారు… జిల్లా పరిషత్ వైస్ చేర్మెన్ గా..రాయదుర్గం కో ఆపరేటివ్ ఛైర్మన్ గా కూడా పని చేశారు. ఆయన మృతిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు సంతాపం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here