త‌న కోప‌మే త‌న శ‌త్రువు అని ఊరికే అన్లేదు..!

బోయ్‌ఫ్రెండ్‌తో మాట్లాడిందో..భ‌ర్త‌తో మాట్లాడిందో తెలియ‌ట్లేదు గానీ.. సెల్‌ఫోన్‌లో ఆవేశంగా మాట్లాడిందో మ‌హిళ‌. ఆ త‌రువాత త‌న కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక‌పోయింది. చేతిలో ఉన్న అర‌టిపండును రోడ్డుపైకి విసిరి కొట్టింది. ఛెంగుమంటూ ఆ అర‌టిపండుపై ఎగిరి దూకింది.

చెప్పుకోవ‌డానికి ఇంకేముంది! అది అస‌లే అర‌టిపండు. పైగా ఎగిరి దూకింది. జ‌ర్రుమంటూ జారి న‌డ్డి విర‌గొట్టుకుంది. ఇలాంటిదేదో జ‌రుగుతుంద‌ని ముందే ఊహించాడో..ఏమోగానీ ఓ వ్య‌క్తి దీన్నంత‌టినీ మొబైల్ ఫోన్‌లో బంధించాడు. సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడు. అది కాస్తా వైర‌లై కూర్చుంది.

https://twitter.com/costin_samantha/status/992621074817798144

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here