జ‌నం మ‌ధ్య హిజ్రాల డాన్స్‌..వారినీ లైంగికంగా వేధించిన పోకిరీలు

ఎన్నిక‌ల ప్ర‌చారంలో జ‌నం దృష్టిని ఆక‌ట్టుకోవ‌డానికి, జ‌నం మ‌ధ్య డాన్స్ చేస్తోన్న హిజ్రాల‌ ప‌ట్ల కొంద‌రు వ్య‌క్తులు త‌మ పైశాచికాన్ని ప్ర‌ద‌ర్శించారు. వారిని లైంగికంగా వేధించారు. ఎక్క‌డ ప‌డితే అక్క‌డ చేతులు వేశారు. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని చిక్‌బ‌ళ్లాపుర జిల్లా గుడిబండ తాలూకాలో వ‌రాల‌కొండ గ్రామంలో చోటు చేసుకుంది.

బాగేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పోటీ చేస్తోన్న ఎస్ఎన్ సుబ్బారెడ్డి ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా.. శ‌నివారం సాయంత్రం వ‌రాల‌కొండ గ్రామానికి వెళ్లారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను జ‌నం దృష్టిని ఆక‌ర్షించ‌డానికి 20 మంది హిజ్రాల‌ను త‌మ వెంట తీసుకెళ్లారు. వారితో డాన్స్ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సంద‌ర్భంగా కొంద‌రు స్థానికులు హిజ్రాల ప‌ట్ల అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించారు. హిజ్రాలంద‌రూ ఏక‌మైన‌ప్ప‌టికీ.. దుండ‌గులు పెద్ద సంఖ్య‌లో ఉండ‌టంతో ఏమీ చేయ‌లేని నిస్స‌హాయ స్థితిలో ఉండిపోయారు. పార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా పెద్ద‌గా ప‌ట్టించుకున్న పాపాన‌పోలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here