ఇదేదో ఫిరంగి అనుకొన్నారు.. కానీ దాని కింద ఉన్నది చూసి అందరూ షాక్ అయ్యారు..!

ఫిరంగి.. ఒకప్పుడు యుద్ధాలలో బాగా ఉపయోగించారు. ఇప్పుడంటే ఆయుధాలు కూడా బాగా ఆధునీకరణ చెందాయి కాబట్టి వాటిని పట్టించుకోవడం లేదు. ఏదైనా మ్యూజియంలకు పోయినప్పుడు, కోటలను సందర్శించినప్పుడు వీటిని చూడొచ్చు. కానీ రష్యాలో ఓ ఫిరంగిని చూసిన కొందరు.. ఇది కూడా మామూలుదే అయి ఉంటుంది అని అనుకున్నారు.. కానీ దాని కింద ఉన్న దాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు.

రష్యాలోని వ్లాదివోస్తోక్ నగరానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఓ వస్తువు కొందరు పర్యాటకులకు కనిపించింది. అది ఓ ఫిరంగి..! అంతా బాగానే ఉంది కానీ ఎప్పుడైతే దాని వద్దకు వెళ్ళి చూశారో అందరూ ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. దాని కింద ఏకంగా ఒక కోట ఉంది. మొదట్లో అంతా ఇదీ సాధారణమైన ఫిరంగే అని అనుకున్నారు. కానీ ఆ ఫిరంగిని కోట పైన ఏర్పాటు చేశారు. దాదాపు సగం కోట భూమి లోపలే ఉండడం విశేషం.

అయితే ఈ కోటను ఎవరో రాజు కట్టించారని అనుకుంటే మన పొరపాటే.. రష్యా సైన్యం దీన్ని నిర్మించింది. 19వ శతాబ్దంలో జపాన్ సైన్యాన్ని అడ్డుకోవడం కోసం దీన్ని నిర్మించింది అప్పటి సైన్యం. ఇది కేవలం ఒక్క కోట మాత్రమే కాదు.. ఇలాంటివి చాలా కోటలు ఆ నగరంలో ఉన్నారు. 1923లో రష్యా సైన్యం ఈ కోటను మూసివేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here