చూసినోళ్లంతా ఇదేదో పాము అనుకున్నారు.. కానీ నిజం తెలిసి షాక్ అయ్యారు..!

తైవాన్ కు చెందిన సైంటిస్టుల వద్దకు కొందరు సముద్రంలో దొరికిన ఒక జీవిని తీసుకొని వచ్చారు. రీసర్చ్ చేసే టీమ్ మొదట దీన్ని ఏదో పాము అని అనుకుంది. కానీ ఆ తర్వాత నిజం తెలిసి వారు కూడా షాక్ తిన్నారు.

రీసర్చ్ టీమ్స్ దీనిపై పరిశోధనలు జరిపి.. ఇది పాము కాదని తేల్చారు. ఇది వైపర్ షార్క్ అట.. ఇవి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయని వారు చెప్పారు. చివరిసారిగా వైపర్ షార్క్ 1986లో మనుషుల కంట కనబడింది. వీటి దంతాలు చాలా చాలా పదునుగా ఉంటాయట. కొన్ని సినిమాల్లో చూపించినట్లుగా ఇవి కొరికితే ఆ జీవి శరీరం తూట్లు పడాల్సిందే. తైవాన్ ఫిషరీస్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ దీనిపై పరిశోధనలు చేస్తోంది. ఈ చేపలు తనకంటే చాలా పెద్దవైన చేపల మీద కూడా దాడి చేస్తాయట. సూది కంటే చాలా పదునుగా ఉంటాయి. పళ్ళను ఎప్పుడూ బయటే ఉంచి.. దాడి చేయడానికి ఎదురుచూస్తూ ఉంటాయని వారు తెలిపారు.

1986లో జపాన్ లోని షికోకు ఐలాండ్ లో చివరిసారిగా ఈ వైపర్ షార్క్ ను పట్టుకున్నారు. దీని సైంటిఫిక్ పేరును Trigonognathus kabeyai గా పెట్టారు. దీని రూపురేఖలు చూసి ఏలియన్ ఫిష్, ఫిష్ ఫ్రమ్ హెల్ అని అంటూ ఉంటారు. ఈ చేపలు కొన్ని వేల మీటర్ల లోతులో కూడా బ్రతుకుతాయని చెబుతారు. వీటి గురించి ఇప్పటివరకూ సైంటిస్టుల వద్ద సరైన సమాచారం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here