బెదురు చూపులు చూస్తోన్న ఈ మ‌హిళ ఓ టాప్ ఎంఎన్‌సీకి సీఈఓ అంటే న‌మ్మ‌గ‌ల‌రా?

ఈ ఫొటోలో భ‌ర్త ప‌క్క‌న కూర్చుని బెదురు చూపులు చూస్తోన్న ఈ మ‌హిళ ఎవ‌రో గుర్తు ప‌ట్ట‌డం.. నాట్ సో ఈజీ. అంత సులువు కాదు. ఎందుకంటే.. అప్ప‌టికీ, ఇప్ప‌టికీ ఏ మాత్రం పోలికలే లేవు. ఆ మ‌హిళ‌.. ఓ మ‌ల్టీ నేష‌న్ కంపెనీకి సీఈఓ.

అదేదో అల్లాట‌ప్పా మ‌ల్టీ నేష‌న్ కంపెనీ కాదు.. పెప్సీకో. ఈ భూమండ‌లం మీద ఎక్క‌డికి వెళ్లినా దొరికే కూల్‌డ్రింక్స్ కంపెనీ అది. అలాంటి సంస్థ‌కు దిశా నిర్దేశం చేసే సీట్లో కూర్చున్న అత్యంత శ‌క్తిమంత‌మైన మ‌హిళ. ఆమే ఇంద్రా నూయి.

ఇటీవ‌లే ఇంద్రానూయి మ‌రో అరుదైన ఘ‌న‌త‌ను కూడా సాధించారు. అదే.. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ బోర్డ్‌లో స్వ‌తంత్ర డైరెక్ట‌ర్‌గా చేరారు.

ఓ మ‌హిళ ఐసీసీ బోర్డ్‌లో డైరెక్ట‌ర్‌గా చేర‌డం ఇదే తొలిసారి. కోల్‌క‌త‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ గ్రాడ్యుయేట్ చేసిన ఇంద్రానూయి తాజా ఫొటో అది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here