ఖతర్నాక్ దొంగలు.. లాడ్జిలో రూమ్ తీసుకున్నారు.. ఏవి ఎత్తుకొని వెళ్తున్నారో తెలుసా..?

ఖతర్నాక్ దొంగలు అంటే వీళ్ళేనేమో.. మొత్తం నాలుగు లాడ్జిలలో నుండి రెండు రెండు రూమ్ లను బుక్ చేశారు. తాము పెద్ద కంపెనీలలో పని చేస్తూ ఉంటామని చెప్పుకున్నారు. ఆ తర్వాత కొద్ది సేపు గడిపి తెచ్చిన బ్యాగ్ లలో నుండి ఓ పెద్ద బ్యాగ్ ను బయటకు తీసుకొని వెళ్తారు. ఏవో వస్తువులు ఉంటాయి అని చూస్తున్నవారు అనుకుంటారు కానీ అందులో ఉన్నదే వారు కొట్టేసిన వస్తువులు. ఇంతకూ లాడ్జిలలో వారు కొట్టేసేవి ఏంటి అనే కదా మీ డౌట్.. టీవీలు..!

హా నిజం.. కర్ణాటక రాష్టంలోని బాగలకోటేలో ఉన్న నాలుగు లాడ్జిలలో రెండు రెండు రూమ్ లను బుక్ చేశారు ఈ కేతు గాళ్ళు. బాగా టిప్ టాప్ గా రెడీ అయ్యేవాళ్ళు.. ఏదో చేతిలో తీసుకొని వెళుతున్నట్లు కనిపిస్తారు. కానీ ఎత్తుకొని వెళ్ళేవి రూమ్ లలో బిగించిన ఎల్.ఈ.డీ.టీవీలు..! అలా మొత్తం నాలుగు లాడ్జిలలో ఉన్న టీవీలను ఎత్తుకొని వెళ్ళారు. తిరిగి వారు గదుల్లోకి రాకపోవడంతో డౌట్ వచ్చిన లాడ్జి యాజమాన్యం గది లోపలికి వెళ్ళి చూడగా టీవీలు మాయమయ్యాయి. సీసీటీవీ పరిశీలించగా వాళ్ళు టీవీలను ఎత్తుకొని వెళుతున్న దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here