సినిమాల్లో కిడ్నాప్ లు చాలా చూసే ఉంటారు.. ఇది నిజ జీవితంలో కిడ్నాప్..!

సినిమాల్లో కిడ్నాప్ ఘటనలు చాలానే చూశారు.. కానీ ఇది మాత్రం రియల్ గా జరిగింది. సీసీటీవీల్లో రికార్డయింది. పట్టపగలు అందరూ చూస్తుండగా కొందరు దుండగులు ఓ వ్యక్తిని కిడ్నాప చేసి వెళ్ళిపోయారు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రం లోని మైసూరులో చోటుచేసుకుంది. అచ్చం సినిమాల్లో లాగానే నలుగురు దుండగులు వాహనంలో నుండి దిగడం ఆ వ్యక్తిని పట్టుకోవడం.. వాహనంలో వెయ్యడం.. అక్కడి నుండి ఎస్కేప్ అయిపోవడం..!

అప్సర్ పాషా.. ఆయుర్వేదం మందులు అమ్ముతూ ఉంటాడు. అక్క కొడుకుతో కలిసి షాపింగ్ కు నదీమ్ ఖాన్ వెళ్ళాడు. అయిదుగురు వ్యక్తులు వచ్చి కారులో నుండి కిందకు దిగారు. ఇద్దరినీ కిడ్నాప్ చేయాలని భావించారు. ఇంతలో వారి మధ్య పెనుగులాట జరిగింది. నదీమ్ ఖాన్ తప్పించుకొని వెళ్ళిపోయాడు. అప్సర్ పాషాను దుండగులు కారులో ఎక్కించుకొని వెళ్ళిపోయారు. ఈ ఘటన మొత్తం సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. కే.ఆర్.నగర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కిడ్నాప్ మరీ ఇంత ఈజీగా చేస్తారా అని ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. కిడ్నాప్ కు సంబంధించిన కారణాలు.. కిడ్నాపర్లకు ఏమి కావాలో ఇంకా బయటకు తెలీలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here