వ‌రస కుదర‌న‌ప్ప‌టికీ ఆమే కావాలంటూ పోలీస్‌స్టేష‌న్ ఎదుట ప్రియుడు!

ఆ ప్రేమికులు ఇద్ద‌రూ దూర‌పు బంధువులు. వ‌ర‌స చూసుకుంటే చెల్లెలు అవుతుంది. అవేవీ తెలియ‌ని వారిద్ద‌రూ ఏడాదికాలంగా ప్రేమించుకుంటున్నారు.

వారి మ‌ధ్య శారీర‌క సంబంధం కూడా ఏర్ప‌డింది. ఈ విష‌యం ఇరు కుటుంబాలకు తెలియ‌డంతో వారు ఆశ్చ‌ర్య‌పోయారు. చెల్లెలి వ‌ర‌స‌య్యే యువ‌తితో ప్రేమ, పెళ్లి కుదర‌దంటూ కేక‌లు వేశారు.

యువ‌తి ఇంట్లోంచి కాలు బ‌య‌టికి పెట్ట‌కుండా క‌ట్టుదిట్టం చేశారు. అయిన‌ప్ప‌టికీ.. ఆ ప్రేమికుడు ఊరుకోలేదు. ఆమే కావ‌లంటూ పోలీస్‌స్టేష‌న్ ఎదుట ఆందోళ‌న‌కు దిగాడు.

ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లోని బాగ‌ల్‌కోటెలో చోటు చేసుకుంది. బాగ‌ల్‌కోటె న్యూసిటీ సెక్టార్ 12కు చెందిన ఆ ప్రేమికుడి పేరు సాగ‌ర్ సుగ‌త్‌క‌ర్‌. అదే కాల‌నీకి చెందిన యువ‌తిని ఏడాది కాలంగా ప్రేమిస్తున్నాడు.

చెల్లెలి వ‌రస అవుతుంద‌నే విష‌యం తెలియ‌క ఆమెతో శారీర‌క సంబంధం కూడా పెట్టుకున్నాడు. వారి ప్రేమ వ్య‌వ‌హారం ప‌ట్ల రెండు కుటుంబాల్లో ఆగ్ర‌హం వ్య‌క్తం అయ్యాయి.

యువ‌తిని ఇంట్లో నిర్బంధించారు. దీనితో సాగ‌ర్‌.. పోలీస్‌స్టేష‌న్ వ‌ద్ద ఆందోళ‌న‌కు దిగాడు. త‌న ప్రియురాలిని విడిపించే బాధ్య‌త పోలీసుల‌దేనని చెబుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here