రెండో పెళ్లికి ఒప్పుకోక‌పోతే రోడ్డుపాలు చేస్తానంటూ భార్య‌కు బెదిరింపులు..వేధింపులు:

బెంగ‌ళూరు: త‌న రెండో పెళ్లికి అంగీక‌రించ‌క‌పోతే రోడ్డుపాలు చేస్తానంటూ క‌ట్టుకున్న భార్య‌ను బెదిరించాడో ఘ‌నుడు. ట్రిపుల్ త‌లాక్ చెప్పి, వేరే పెళ్లి చేసుకుంటాన‌ని హెచ్చ‌రించాడు. దీనికి ఏ మాత్రం బెదిరిపోలేదా మ‌హిళ‌. నేరుగా వెళ్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ఆ భ‌ర్త‌ను అరెస్టు చేశారు.

బెంగ‌ళూరు కేఆర్ పుర‌లో చోటు చేసుకుంది ఈ ఘ‌ట‌న‌. ఆ భ‌ర్త పేరు రియాజ్‌. బెంగ‌ళూరుకు చెందిన రియాజ్‌కు 2004లో చిత్తూరుకు చెందిన ష‌బ్నమ్‌తో వివాహ‌మైంది. వారికి ఓ కుమారుడు.

 

మూడేళ్లుగా రియాజ్‌కు వేరే యువ‌తితో వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. ఈ విష‌యం ష‌బ్న‌మ్‌కు తెలియ‌దు. దీనితో.. అత‌ను మ‌రింత రెచ్చిపోయాడు.

వివాహేత‌ర సంబంధాన్ని పెట్టుకున్న యువ‌తిని రెండో పెళ్లి చేసుకుంటాన‌ని, ఇందుకు ఒప్పుకోవాలంటూ వేధింపులు మొద‌లు పెట్టాడు.

రెండో పెళ్లికి ఒప్పుకోక‌పోతే మూడుసార్లు త‌లాక్ చెబుతాన‌ని హెచ్చ‌రించాడు. దీనితో- బాధిత మ‌హిళ కేఆర్ పుర పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. రియాజ్‌ను అరెస్టు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here