ఆకాశం నుండి భారీ లోహపు గుండ్లు మండుతూ వారి ఊరి మీద పడ్డాయి..!

ఆకాశంలో నుండి మూడు పెద్ద పెద్ద లోహపు గుండ్లు వారి ఊరి మీద పడ్డాయి. పెరూ దేశంలోని ఓ గ్రామం మీద మూడు భారీ లోహపు గుండ్లు పడడం వారిని భయభ్రాంతులకు గురిచేస్తోంది. మొత్తం మూరు లోహపు గుండ్లు మండుతూ వారి గ్రామం మీద పడడంతో ఎలా ఇది జరిగింది అని తలలుపట్టుకుంటున్నారు.

బ్రెజిల్, పెరు దేశాల్లోని చాలా మంది ఆకాశంలో నుండి ఈ అగ్నిగోళాలు భూమి మీదకు పడడాన్ని వీక్షించారు. కొందరు తమ కెమెరాల్లో రికార్డు చేశారు. టింగో మారియా, పుకల్పా ఊర్లపై ఈ గోళాలు పడ్డాయి. ఒక్కో ఊరికి దాదాపు 115 మైళ్ళ దూరం ఉంది. ఇలా ఎలా జరిగింది అని పలు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఇది ఉల్కాపాతం వలన ఏర్పడ్డాయని కొందరు అంటున్నారు. కానీ ఆ ప్రాంతంలో ఉల్కలు పడే అవకాశమే లేదని మరికొందరు వాదిస్తున్నారు. అలాగే ఇవి భూమి మీద పడ్డ సమయంలో ఆకాశంలో ఎటువంటి విమానాలు ప్రయాణించలేదని చెబుతున్నారు. ఇవి ఏమైనా స్పేస్ రాకెట్ కు సంబంధించిన వస్తువులా అన్న కోణంలో కూడా ఆరాతీస్తున్నారు. పాత శాటిలైట్లకు సంబంధించిన వస్తువులు అయి ఉండొచ్చని మరికొందరి వాదన.. ఏది ఏమైనా కానీ ఆ ప్రాంతవాసులు మాత్రం ఎప్పుడు ఏ ఉపద్రవం ముంచుకొస్తుందా అని భయపడుతూ ఉన్నారు. పచ్చిక బయళ్ళలో పడ్డాయి కాబట్టి సరిపోయింది కానీ పొరపాటున మనుషుల మీద పడి ఉంటే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here