ఇంట్లో ప‌డ్డ దొంగోడి వెనుక తోక ఊపుకుంటూ తిరిగిన పెంపుడు శున‌కం!

పెంపుడు శున‌కాలు ఏం చేస్తాయి? కొత్త ముఖాలేవైనా క‌నిపిస్తాయి. మొరిగి గీ పెడ‌తాయి. పారిపోయేంత వ‌ర‌కూ వ‌దిలి పెట్ట‌వు. ర‌చ్చ ర‌చ్చ చేసేస్తాయి. ఈ పెంపుడు శున‌కం మాత్రం దీనికి భిన్నంగా ప్ర‌వ‌ర్తించింది. య‌జ‌మాని, ఆయ‌న కుటుంబ స‌భ్యులెవ‌రూ లేని స‌మ‌యం చూసి, చోరీకి వ‌చ్చిన ఓ దొంగోడి వెనుక తోక ఊపుకొంటూ తిరిగింది.

ఆ దొంగ‌గారు ఎటు వెళ్తే అటు అత‌ని వెనుకే తిరిగింది. బాగా ప‌రిచ‌యం ఉన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించింది. దీనికి సంబంధించిన విజువ‌ల్స్‌.. ఆ ఇంట్లో అమ‌ర్చిన సీసీ కెమెరాల్లో రికార్డ‌య్యాయి. అమెరికాలోని మిల్ట‌న్‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న ఇది.

దీనికి సంబంధించిన వీడియోను మిల్ట‌న్ పోలీసులు సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు. ఆ శున‌కం ప్ర‌వ‌ర్తించిన విధానాన్ని బ‌ట్టి పోలీసులు.. ఆ దొంగ కొత్త వ్య‌క్తి కాద‌ని, ఆ ఇంటి వారికి ప‌రిచ‌యం ఉన్న వ్య‌క్తేన‌ని నిర్ధారించారు. ఆ కోణంలో ద‌ర్యాప్తు మొద‌లు పెట్టారు. ఈ ర‌కంగా చూసినా ఆ శున‌కం త‌న న‌మ్మకాన్ని పోగొట్టుకోలేద‌నే అనుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here