పెట్రోల్, డీజల్ రేట్లను తగ్గించిన కేరళ.. తెలుగు రాష్ట్రాలు తగ్గించేదెన్నడో..!

కేరళ ప్రజలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్‌, డీజిల్‌ లీటర్‌ ధరపై రూ.1 తగ్గిస్తున్నట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రకటించారు. తగ్గించిన ధరలు శుక‍్రవారం (జూన్‌ 1) నుంచి అమల్లోకి వస్తాయని తెలిపారు. ఇంధనంపై ‘రిటైల్‌ వ్యాట్‌’ను తగ్గిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పరుగులు పెడుతున్న ఇంధన ధరలకు అడ్డుకట్ట వేసిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచిందని తెలిపారు. రాష్ట్ర ఖజానాపై 509 కోట్ల రూపాయల భారం పడుతున్నప్పటికీ తమకు ప్రజల శ్రేయస్సే ముఖ్యమని ఆయన అన్నారు. ప్రజల ఇబ్బందుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కేంద్రం చేయలేని పని మేం చేశామని అన్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా పెట్రోల్-డీజల్ రేట్లపై త్వరలోనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని అనుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ధరలు తగ్గే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. నేడో-రేపో కేసీఆర్ దీని మీద ప్రకటన ఇచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కేంద్రం మాత్రం ఈ విషయంపై ఎటువంటి నిర్ణయం తీసుకునే కనిపించడం లేదు. అప్పుడెప్పుడో అమిత్ షా నాలుగు రోజులు ఆగండి పెట్రోల్ రేట్లను అదుపు చేస్తామని చెప్పారు. అయితే అదంతా జరిగే పనిలా కనిపించడం లేదు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here