అంతో.. ఇంతో.. గుడ్ న్యూస్ ఇదొక్కటే మనకు..!

ప్రతీ ఏడాది లాగే ఈ ఏడాది కూడా బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయితే అందులో సగటుజీవికి గుడ్ న్యూస్ అంటే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గనుండడమే..! తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ లో దాదాపు రెండు రూపాయలు పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గనున్నాయి. ఎందుకంటే ఎక్సైజ్ డ్యూటీ రెండు రూపాయలు తగ్గించడం జరిగింది.

బ్రాండెడ్, అన్‌బ్రాండెడ్ పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు జైట్లీ స్పష్టంచేశారు. అన్ బ్రాండెడ్ పెట్రోల్‌పై ప్రస్తుతం లీటర్‌కు రూ.6.48 బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ ఉండగా.. ఇప్పుడు దానిని రూ.4.48కి తగ్గించారు. బ్రాండెడ్ పెట్రోల్‌పై రూ.7.66గా ఉన్న డ్యూటీని రూ.5.66కు తగ్గించారు. అటు అన్‌బ్రాండెడ్ డీజిల్‌పై రూ.8.33గా ఉన్న ఎక్సైజ్ డ్యూటీ రూ.6.33కి తగ్గించగా.. బ్రాండెడ్ డీజిల్‌పై రూ.10.69గా ఉన్న బేసిక్ ఎక్సైజ్ డ్యూటీ రూ.8.69కు తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.2 మేర తగ్గే అవకాశాలు ఉన్నాయి. గతేడాది అక్టోబర్‌లోనూ ఎక్సైజ్ డ్యూటీని లీటర్‌కు రూ.2 తగ్గించారు.. ఇప్పుడు మరోసారి ఇంకో రెండు రూపాయలు తగ్గనుంది. గత నెలరోజులుగా పెట్రోల్, డీజల్ రేట్లు భారీగా పెరుగుతూ వెళుతున్నాయి. తాజాగా రెండు రూపాయలు తగ్గించడం కాస్త ఊరటనిచ్చే అంశమే..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here